కరోనా వల్ల మనిషి జీవన విధానమే పూర్తిగా మారిపోయింది.. ఎవరికైనా ఇదివరకు ఏదైనా జబ్బు చేస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లేవారు.. కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో ఏ డాక్టర్‌ను కలవడం వీలుపడటం లేదు.. ఎక్కడ చూడు కరోనా మాటే గానీ వేరే ఏది వినపడటం లేదు.. మరి ఇలాంటి పరిస్దితుల్లో సాధారణ వ్యాధులు వచ్చినవారి పరిస్దితి చాలా దారుణం.. వైద్యులను కలవాలంటే ఒకపట్టాన వీలుకావడం లేదు.. అందుకే ఇప్పుడు కరోనా లాక్‌డౌన్లతో వైద్య రంగం కొత్త పంథాలో నడుస్తోంది.

 

 

ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ మెడిసిన్‌ విధానం తెరపైకి వచ్చింది. రోగులకు సూచించిన సమయంలో వారు వీడియోకాల్‌ చేస్తే.. డాక్టర్లు సలహాలు, సూచనలతోపాటు.. చికిత్స అందజేస్తున్నారు కొందరు వైద్యులు. అంతే కాకుండా మందుల ప్రిస్ర్కిప్షన్‌ను సైతం ఆన్‌లైన్‌లోనే ఇస్తున్నారు. మరీ అవసరం అనుకుంటే, రోగుల ఇంటికే వైద్యులు వెళ్తున్నారు. ఇక చికిత్సకు ముందు జరిపే పరీక్షల కోసం డయాగ్నస్టిక్స్‌ సిబ్బంది రోగి ఇంటి వద్దేకే వచ్చి సేవలు అందిస్తున్నారు. ఇకపోతే ఇలాంటి ఆన్‌లైన్‌ వైద్యం, టెలీమెడిమెడిసిన్‌ సేవలు, మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ వంటివి అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. కరోనా కల్లోలం నేపథ్యంలో ఇప్పుడిప్పుడే భారతీయులు ఈ వైద్య విధానానికి అలవాటుపడుతున్నారు.

 

 

ఇకపోతే ఇప్పటి నుండి భవిష్యత్తు అంతా ఆన్‌లైన్‌, టెలీమెడిసిన్‌దే. దీనివల్ల వైద్యులకు, రోగులకు ఎన్నో ఉపయోగాలున్నాయి. అయితే ఆన్‌లైన్‌ మెడిసిన్‌కు ఆదరణ పెరిగితే ప్రైవేట్ ఆస్పత్రులకు కొంత మేరకు ఇబ్బందులు ఉంటాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. ఇలా ఎందుకంటే ఆన్‌లైన్‌ కన్సల్టెన్సీ ఫీజులు నేరుగా డాక్టర్లకు వెళ్లుతాయి, ఇదేగాక రోగులు ఆస్పత్రికి రాకపోవడం వల్ల.. డయాగ్నస్టిక్‌ పరీక్షలు తగ్గిపోతాయి.

 

 

అదే ఆస్పత్రికి వస్తే.. తప్పనిసరిగా ఏదో ఒక పరీక్ష చేసుకోమని సూచించడం వైద్యులకు అలవాటు. ఇక ఈ ఆన్‌లైన్‌ విధానంలో అవసరమైతే తప్ప డాక్టర్లు పరీక్షలకు సిఫారసు చేయడం లేదు. ఏది ఏమైనా ఈ విధానం వల్ల ఇప్పుడు రోగులకు కొంతమేర ఉపశమనం కలుగడమే కాదు, ప్రైవేట్ హాస్పటల్స్‌ల దోపిడికి తెరపడుతుంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: