కరోనా భారతదేశ ప్రజల్లో భయాన్ని కలిగించలేక పోతుంది.. కానీ తన వ్యాప్తిని మాత్రం పెంచుకుంటుంది.. రోజురోజుకు ప్రపచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విసృతంగా విస్తరిస్తుంది.. ఇక మనదేశంలో అమలు చేసిన లాక్‌డౌన్ వల్ల కలిగిన ఫలితం ఎంతవరకు లాభించిందో పాలకులకే అర్ధం కావాలి.. కానీ సామాన్యుడు మాత్రం బ్రతకలేని స్దితికి చేరుకున్నాడు.. ఒక మన దేశమనే కాదు కరోనాతో ఆయా దేశాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఇకపోతే మన దేశంలో ఈ వైరస్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీనికి కారణం ప్రజలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోపోవటం. దాంతో నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా బాగా వ్యాపిస్తోంది.

 

 

ఇక విదేశాల్లో ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతున్నప్పుడు కాస్త అప్రమత్తం అయ్యారు. అందువల్ల వైరస్‌ వ్యాప్తి తగ్గిపోయింది. కానీ మన దేశంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కరోనా తన వేగాన్ని పెంచి వ్యాప్తి చెందుతోంది. దీని స్పీడ్ బట్టి చూస్తే సెప్టెంబరు నాటికి భారత్‌లో 20 కోట్ల కేసులు వస్తాయని అంచనా. వినే వారికి ఈ సంఖ్య ఎక్కువ అనిపించవచ్చు. కానీ, 138 కోట్లల్లో ఉన్న మన జనాభాలో 20 కోట్లు ఎక్కువ కాదు. అయితే ఇన్ని కేసులను తట్టుకొనే సామర్థ్యం మన వైద్య, ఆరోగ్య రంగానికి లేదు. కాబట్టి మరణాల రేటు కూడా పెరగవచ్చనే అభిప్రాయం వెల్లడవుతుంది..

 

 

ఇకపోతే మనదేశంలో కరోనా కేసులు కోట్లల్లో రావచ్చని కొవిడ్‌ నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు, ప్రముఖ సాంక్రామిక వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ జయప్రకాశ్‌ మలీల్‌ అంచనా వేశారు. ఇతను ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజీన్‌ ‘నేచర్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రముఖ జర్నలిస్టు కరణ్‌ థాపర్‌ నిర్వహించే ‘డెవిల్స్‌ అడ్వొకేట్‌’ కార్యక్రమంలో తన అభిప్రాయాలను ఈ విధంగా వెల్లడించారు. అంతే కాకుండా లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడగా, ప్రజలకు ఎదురైన ఇబ్బందులను పరిష్కరించలేకపోయామని పేర్కొన్నారు..

 

 

ఒకవేళ ఈ వైరస్ విషయంలో ముందే జాగ్రత్తగా ఆలోచించి లాక్‌డౌన్‌ను ప్రకటిస్తే ఇంత నష్టం జరిగేది కాదు. సమయం మించిపోతోందనే ఆలోచనతో లాక్‌డౌన్‌ను ప్రకటించారు. దానివల్ల మనకు కలిగిన లాభం కన్నా నష్టం ఎక్కువనేది నా అభిప్రాయం అని తెలిపారు. ఇక అంతా జరిగాక ఎవరెన్ని అభిప్రాయాలు వెల్లడించిన మన ప్రజలకు ఒరిగేది ఏం ఉండదు. ఇప్పటికే ఆరోగ్య శాఖ హెచ్చరికలు కూడా జారి చేసింది. జరగవలసిన నష్టం జరిగిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: