ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక చిన్న వైరస్ కరోనా అన్న విషయం తెలిసిందే.. ఇది చిన్నదే అయినా ఇప్పుడు ప్రపంచ దేశాలను శాసిస్తుంది.. ఈ వైరస్ వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు దీనికి వ్యాక్సిన్ కనిపెట్టలేక పోయారు.. ఇప్పటికే పలాన కంపెనీ నుండి కరోనాకు మందు అంటూ ఊకదంపుడు ప్రచారాలు జరుగుతున్నాయో గానీ ఏ దేశం అధికారికంగా దీన్ని ధృవీకరించలేక పోతుంది.. ఇలాంటి సమయంలో ఒకవైపు ప్రజల్లో భయం, మరో వైపు ఆశ.. ఈ రెండు జనం జీవితాలతో ఆడుకుంటున్నాయి..

 

 

ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రారంభమైందని పరిశోధకులు వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రతి గల్లీలో కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎదురవుతుంటారట.. ఇలాంటి క్లిష్ట సమయంలో కరోనాకు మందు అని వినిపించే వార్త ప్రాణానికి అమృతంలా తోస్తుంది.. ఇవి ఎంతవరకు ఫలితాలను ఇస్తాయో తెలియదు గానీ ఈ వార్తలు విన్నప్పుడల్లా పోతున్న ప్రాణాలు ఊపిరి పోసుకుంటున్నాయి..

 

 

ఇకపోతే అమెరికాలోని లూసియానా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఒక ప్రయోగంలో పసికందులు, చిన్నారులకు తట్టు తదితర వ్యాధుల నుంచి రక్షణ కల్పించే లైవ్‌ ఎటెన్యుయేటెడ్‌ వ్యాక్సిన్లను వినియోగించడం వల్ల కరోనా లక్షణాల తీవ్రతను తగ్గించవచ్చని తేలిందట. అదీగాక ఈ కొవిడ్‌ కారణంగా ఊపిరితిత్తుల్లో కలిగే తీవ్ర మంటను ఈ వ్యాక్సిన్ల ద్వారా తగ్గించే అవకాశం ఉన్నదని వారు వెల్లడిస్తున్నారు..

 

 

ఇక రోగి శరీరంలోకి వెళ్లిన ఈ వ్యాక్సిన్లు రోగ నిరోధక కణాలను ఉత్తేజపరుస్తాయని అందువల్ల వల్ల కొవిడ్‌ లక్షణాల తీవ్రతను తగ్గించవచ్చని ఎల్‌ఎస్‌యూ పరిశోధకులు పాల్‌ ఫిడెల్‌ తెలిపారు. కరోనా ముప్పు అధికంగా ఉండే వైద్య సిబ్బందికి ఈ వ్యాక్సిన్లు చాలా ఉపయుక్తంగా ఉంటాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు... ఇక ఇలాంటివి వినడానికి బాగానే ఉంటాయి గానీ కరోనాకు మందులు మార్కెట్లోకి వచ్చి అవి రోగుల మీద పూర్తి ప్రభావవంతంగా పని చేసినప్పుడు మాత్రమే కరోనాకు మందు దొరికిందని భావించాలి.. అప్పటి వరకు వీటిమీద ఆశపడి ప్రాణాలను ఈ వైరస్‌కు అప్పగించడం మాత్రం ప్రమాదమని అంటున్నారు నెటిజన్స్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: