అంటే అన్నాం అని అంటారు కానీ.. ఈ కరోనా వైరస్ సమయంలో పెళ్లి అంత అవసరమా? అని మనకు అనిపించచ్చు కానీ.. కొంతమందికి ఎన్నో ఏళ్ల నుండి పెళ్లి అవ్వక ఇబ్బంది పడే అందరికి ఇప్పుడు పెళ్లిళ్లు కుదిరాయి.. ఇప్పుడు పెళ్ళి కాకపోతే ఎప్పుడు కాదు అన్నట్టు పెళ్లి చేసుకుంటున్నారు కొందరు.. 

 

సరే ఇది అంత పక్కన పెడితే.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు కలకలం రేపుతున్న సమయంలో పెళ్లిలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి 15 మందికి కరోనా సోకడానికి కారణమైన ఓ కుటుంబానికి అధికారులు భారీ జరిమానా విధించారు. వరుడు కుటుంబానికి ఏకంగా 6 లక్షల రూపాయలు ఫైన్ వేశారు. ఇంకా ఈ ఘటన రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో చోటుచేసుకుంది. 

 

పూర్తివివరాల్లోకి వెళ్తే.. కరోనా కారణంగా పెళ్ళికి కేవలం 50మంది అతిధులు మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఆ నిబంధనలను ఉల్లఘించి పెద్ద సంఖ్యలో అతిథులను ఆహ్వాననించారు. ఇంకా ఆ పెళ్ళికి హాజరైన 15మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇంకా వారిలో ఒకరు మరణించారు కుడా! దీంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఈ నెల 22న పెళ్ళికొడుకు అతని తండ్రిపై కేసు నమోదు చేశారు. 

 

ఇంకా కరోనా వైరస్ సోకిన వారిని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారందరికీ కరోనా పరీక్షలు.. చికిత్స, ఆహారానికి ఏకంగా రూ.6,26,600 అయింది. దీంతో ఈ మొత్తాన్ని గీసులాల్ కుటుంబం నుంచి వసూలు చేయాలని నిర్ణయించిన కలెక్టర్ రాజేంద్ర భట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మొత్తాన్ని వసూలు చేసి ముఖ్యమంత్రి సహాయనిధిలో డిపాజిట్ చేయాలని సూచించారు. ఏది ఏమైనా ఈ కోవిడ్ సమయంలో అతి ఎక్కువ అతిథుల మధ్య పెళ్లి చేసుకోవాలి అనుకుంటే లక్షలు లక్షలు ముట్టచెప్పులోవాల్సి వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: