కర్ణాటక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కర్ణాటక రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ అమలు కానుంది. పదో తరగతి పరీక్షలు ఉన్నందున ప్రస్తుతానికి లాక్ డౌన్ ను వాయిదా వేసిన ప్రభుత్వం కట్టుదిట్టమైన నిబంధనలతో లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ప్రణాళికలను రూపొందించింది. 
 
సీఎం యడ్యూరప్ప నిన్న మంత్రులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో సీఎం జూలై 5వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపారు. ప్రతిరోజు రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని చెప్పారు. వారంలో ఐదురోజులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. 
 
ఆదివారం అత్యవసర సేవలు మినహా మొత్తం బంద్‌ అని కీలక ప్రకటన చేశారు. క్యాబ్‌లు, ట్యాక్సీలు, బస్సులతో పాటు ఇతర వాహనాలకు కూడా అనుమతి ఇవ్వబోమని తెలిపారు. రాత్రి నుంచి కర్ఫ్యూ నిబంధన అమల్లోకి వస్తుందని.... జూలై 5 వరకు ఇప్పుడున్న నిబంధనలే కొనసాగుతాయని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు, మరోవైపు కరోనా కేసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. 
 
రాష్ట్రంలో గత మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బెంగళూరు నగరంలో నిన్న ఒక్కరోజే 569 కేసులు నమోదు కాగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11,923కు చేరింది. కర్ణాటకలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో అధికంగా కేసులు నమోదైన ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి.                             

మరింత సమాచారం తెలుసుకోండి: