ఈ మద్య భార్యాభర్తల సంబంధాల్లో చీటికి మాటికి గొడవలు.. చివరికి విడాకుల వరకు వెళ్తున్నాయి. మరికొన్ని చోట్ల దారుణంగా వివాహేతర సంబంధాల వల్ల భార్యా భర్తల చంపుకుంటున్నారు.  మూడు ముళ్ల బంధం.. పెద్దల దీవెనలు ఇవన్నీ పక్కన బెట్టి దారుణంగా ఒకరినొకరు చంపుకుంటున్నారు.  ముఖ్యంగా అక్రమ సంబంధాల వల్ల ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి.  ఈ మద్య కాలంలో ప్రియుడి మోజులో పడి భర్తలను కడతేర్చిన భార్యల కేసులు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.  అలాగే అక్రమ సంబంధం వల్ల కట్టుకున్న భార్యని, పిల్లలను సైతం కడతేర్చిన భర్తల కేసులు వెలుగులోకి వచ్చాయి.  ఈ మద్య దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడంతో లాక్ డౌన్ ప్రకటించారు.  

 

దాంతో ఇంటి వద్ద భార్యభర్తలు ఉండటంతో ఎన్నో గొడవలు బయటకు వచ్చాయి.  ముఖ్యంగా గృహ హింస కేసులు ఎన్నో నమోదు అయ్యాయి.  ఇందులో భార్యాబాధితుల కేసులు కూడా బయటకు వచ్చాయి. తన భార్య చిత్రహింసలు పెడుతోందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. పోలీసులు కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నారని, ధర్మాసనమే తనకు న్యాయం చేయలని కోరాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా పిటిషన్‌కు జత చేశాడు. పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.   జ్యోతిర్మయిమజుందార్ అనే ఓ సాఫ్టవేర్‌ ఉద్యోగి తల్లిదండ్రులు, భార్యతో కలిసి కోల్‌కతాకు ఉండేవాడు. కానీ ఇటీవల కరోనా కారణంగా తల్లిదండ్రులను  తన సొంతగ్రామమైన బైద్యబతిలో వదిలిపెట్టి వచ్చాడు.

 

లాకౌ డౌన్ సడలింపు తర్వాత తల్లిదండ్రులను ఇంటికి తెచ్చుకున్నాడు. ఇది అతని భార్యకు నచ్చలేదు. తరుచూ ఆమె చెంపలపై కొట్టడం, సిగరేట్లతో కాల్చడం, పిన్నీసులతో గుచ్చడం మొదలుపెట్టింది. నోటికి వచ్చినట్టుగా తిడుతూ వేధించేది. వీటిని  భరించలేకపోయిన అతడు ఓ రోజు వీడియో తీశాడు. తీసుకెళ్లి పోలీసులకు చూపించి కేసు పెట్టాడు. పురుషులకు ప్రత్యేకంగా చట్టాలు లేకపోవడంతో కేసు నమోదు చేసుకొని మాట్లాడుతామని పంపించేశారు. పోలీసులు ఏం చేయలేరని గుర్తించి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: