2019 ఎన్నికల్లో టీడీపీ కాస్తో కూస్తో మంచి ఫలితాలు రాబట్టింది మూడు జిల్లాల్లోనే. విశాఖపట్నం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో నాలుగేసి సీట్లు గెలుచుకుంది. అయితే భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం....టీడీపీని వీక్ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లారు. అందులో భాగంగా టీడీపీలో కీలకమైన నేతలనీ తమ వైపు తిప్పుకున్నారు. ముఖ్యంగా టీడీపీ స్ట్రాంగ్‌గా ఉన్న జిల్లాలపై ఫోకస్ చేసి, మళ్ళీ కోలుకోలేని దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు.

 

అయితే జగన్ అనుకున్న విధంగా టీడీపీకి విశాఖ, ప్రకాశం జిల్లాలో చెక్ పెట్టేశారు. మూడు రాజధానులలో భాగంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నట్లు ప్రకటించి, టీడీపీకి షాక్ ఇచ్చారు. అక్కడ నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న కూడా పెద్దగా ఉపయోగం లేదు. వారి బలం ఎప్పుడో తగ్గిపోయింది. ఇటు ప్రకాశం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్‌ని వైసీపీ వైపు వచ్చేలా చేశారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా జగన్‌కు మద్ధతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు కూడా వస్తున్నాయి.

 

అలా అని వారు ప్రస్తుతానికి టీడీపీలో ఉన్నా సరే పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. ఈ విధంగా ప్రకాశం, విశాఖ జిల్లాల్లో టీడీపీకి చెక్ పెట్టేసిన జగన్‌కు...తూర్పుగోదావరిలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఇక్కడ టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవాని, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరీ, మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్పలు ఇప్పటికీ బలంగానే ఉన్నారు.

 

ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండటం, సమస్యలపై పోరాటం చేయడం వల్ల వీరు బాగా స్ట్రాంగ్ అయ్యారు. పైగా ఇక్కడ టీడీపీ బలంగా ఉండటం,  వైసీపీ నేతలు ఎఫెక్టివ్‌గా పనిచేయకపోవడం కూడా నలుగురు ఎమ్మెల్యేలకు కలిసొస్తుందని తెలుస్తోంది. అందుకే అధికారంలో ఉన్నాసరే జగన్‌కు తూర్పుగోదావరి టీడీపీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టలేకపోతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: