ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు శాసించాలి అంటే చాలా వరకూ కుల ప్రాతిపదికన రాజకీయ నాయకులు వ్యూహాలు ప్రతివ్యూహాలు బేరీజు వేసుకుని ప్రత్యర్థులపై బాణాలు విసురుతున్నారు అని చాలామంది చెబుతుంటారు. చాలా వరకు ఆంధ్ర ఓటర్ ని ప్రభావితం చేసేది కులమని అంటుంటారు. అటువంటిది ఇప్పుడు ఆ కులాన్ని ఆధారం చేసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు ఆయన వ్యవహరిస్తున్న తీరుపై వార్తలు ఏపీ మీడియా సర్కిల్లో గట్టిగా వినబడుతున్నాయి.

 

జనసేన పార్టీ పెట్టిన మొదటి లో ఎవరైనా కులం తనకు అంటగడితే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కోపం విపరీతంగా వస్తుందని, నేను భారతీయుడును ఏ కులానికి, ఏ మతానికి చెందినవాడును కాదు అంటూ వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ఇటీవల జగన్ సర్కార్ కాపు కార్పొరేషన్ కింద నిధులు విడుదల చేసిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయని కొంతమంది భావిస్తున్నారు. కుల రాజకీయాలకు చాలా దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ తాజాగా కాపు కులం అంటూ వ్యాఖ్యలు చేస్తూ కాపు రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం పట్ల చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. గతంలో చంద్రబాబుకి మిత్రపక్షంగా ఉన్న టైంలో కాపు రిజర్వేషన్ అంశం గురించి ముద్రగడ్డ తీవ్రస్థాయిలో పోరాడి అనేక అవమానాలు పొందటం జరిగింది. ఆయన కుటుంబాన్ని తీవ్రస్థాయిలో చంద్రబాబు ప్రభుత్వం వేధించినట్లు ముద్రగడ్డ స్వయంగా ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో తెలపడం జరిగింది.

 

ఆ సమయములో చంద్రబాబుతో మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రశ్నలు కాపులు తరపున వేయకుండా ఇప్పుడు తాజాగా కాపులు రిజర్వేషన్లు అంటూ మాట్లాడుతున్న తీరు నుద్దేశించి కుల ప్రాతిపదిక రాజకీయాలు చేయడానికి పవన్ కళ్యాణ్ కూడా దిగిపోయాడు అన్న కామెంట్లు బలంగా వినబడుతున్నాయి. ఈ విధంగా పవన్ కళ్యాణ్ తనని తాను ఓ కులానికి పరిమితం చేసుకుంటే రాబోయే రోజుల్లో 2019 కంటే మరీ దారుణంగా పార్టీ పరిస్థితి మారే అవకాశం ఉందని… ఇతర సామాజిక వర్గాలకు చెందిన అభిమానులు దూరమై పోయే ప్రమాదం నెలకొని ఉందని పవన్ అనుసరిస్తున్న తీరుపై మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: