ఒక వైపు దేశ వ్యాప్త లాక్‌డౌన్, మరో వైపు ఎంతో మంది మహిళలకి ఇంట్లో హింసాత్మక భాగస్వాములతో కూడిన లాక్ డౌన్. బయటకి వెళ్లలేక, ఇంట్లో ఉండలేక, ఎవరికి చెప్పాలో అర్ధంకాక సతమతమవుతున్న వందలాది మహిళలు. భర్త పెట్టే మానసిక, శారీరక హింస భరించలేక ఎంతో మంది పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. గతంలో ఆమె ఉద్యోగానికి వెళ్లిపోవడం వలన, ఆమె భర్త ఉద్యోగ రీత్యా ప్రయాణాలలో ఎక్కువ సమయం గడుపుతూ ఉండటం వలన.. కలహాలు.. కక్ష సాధింపు చర్యలకు పాల్పపడుతున్నారు. లాక్‌డౌన్‌లో కుటుంబ సభ్యులందరూ ఒకే చోట ఉండటంతో ఆమె పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.  ఇక గృహి హింస అంటే.. భర్త వేధింపులు.. అత్తమామల ఎత్తి పొడుపు మాటలు.. నాలుగు గోడల మధ్య నిత్యం నరకం... ఇదే గృహ హింస.   

IHG

కరోనా వైరస్‌ ఆడవాళ్లకు ప్రియమైన శత్రువుగా మారింది. భర్త, పిల్లలు, పెద్దలు ఇంటికే పరిమితం చేసింది. ఓ వైపు కుటుంబ సభ్యుల్లో ఆప్యాయత, అనురాగాలు పెరిగితే మరోవైపు ఇల్లాలికి కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. ఇంటిపనులన్నింట్లో నేను సైతం అని దూసుకుపోతున్న వనితలకు కొత్త కష్టాలు పలికరిస్తున్నాయి. లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న దేశాలన్నింటిలో గృహహింస గణనీయంగా పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. సొంత ఇంట్లోనే వారికి రక్షణ కరువైందన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ఒక్క పంజాబ్‌లోని లుధియానాలోనే లాక్‌డౌన్‌ కాలంలో వంద ఆత్మహత్య, 1500 గృహ హింస కేసులు నమోదైనట్లు డీసీపీ అఖిల్‌ చౌదరి తెలిపారు.

IHG

లాక్‌డౌన్‌కు ముందు 60 ఆత్మహత్య, 850 గృహహింస కేసులు నమోదైనట్లు వివరించారు.  ఈ నేపథ్యంలో మానసిక ఒత్తిడి, నిరుద్యోగం, ఆర్థిక కారణాల వల్ల చాలా మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో గమనించామని డీసీపీ అఖిల్‌ చౌదరి చెప్పారు. గృహ హింసకు లోనైన మహిళలకు సంరక్షణ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ, చాలా తక్కువ మంది మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఈ చట్టంపై అవగాహనను పెంచుకుంటే వేధింపులను దూరం చేసుకోవచ్చు అంటున్నారు అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: