ఈ మద్య కొంత మంది చేస్తున్న అత్యుత్సాహం వారిని ఇబ్బందుల్లో పడేస్తున్న సంగతి తెలిసిందే.  క్రేజీ కోసం చేయడం ఆ తర్వాత నానా తంటాలు పడటం చూస్తూనే ఉన్నాం. ఇక సెలబ్రెటీలు ఏం చేసిన అది త్వరగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా బెల్లీ డ్యాన్సర్‌ డాన్సర్ సామా ఎల్‌-మస్రీకు ఈజిప్ట్ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.  సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసినందుకు ఆమెకు ఈ శిక్ష ఖరారు చేశారు. దీంతో ఈ విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు. ఆమె చేసిన వీడియోలు విచ్చల విడితనంగా ఉన్నాయని కేసు నమోదు కావడంతో శిక్ష తప్పలేదు.  సాంప్రదాయాలకు పెద్ద పీట వేసే ఇక్కడ వారికి వ్యతిరేకంగా వెటకారంగా పోస్ట్ చేయండతో అంతరూ తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు.  అంతే కాదు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

దాంతో ఆమెకు   మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష, రూ. 14 లక్షల జరిమానా విధించింది.  సామా ఎల్‌-మస్రీ టిక్‌టాక్, యూట్యూబ్‌లలో వీడియోలను పోస్టు చేసింది. ఇవి వైరల్ కావడంతో లైంగిక సంప్రదాయాలను దెబ్బతీస్తూ విచ్చలవిడి తనాన్ని పెంచేలా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు   తనకు ఏ పాపం తెలియదని ఆమె వాదిస్తోంది. తన మొబైల్‌లోని వీడియోలనూ, పొటోలనూ ఎవరో దొంగిలించి సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తోంది. ఏప్రిల్ 23న పోలీసులు అరెస్ట్ చేశారు.

 

దీనిపై విచారణ చేపట్టిన కైరో న్యాయస్థానం దోషిగా పరిగణించింది.3 లక్షల ఈజిప్షియన్ పౌండ్ల జరిమానాతో పాటు జైలు శిక్ష విధించింది.  తనపై కావాలని కొంత మంది ఇలా చేస్తున్నారని.. తాను అమాయకురాలినని అన్నారు.  తన మొబైల్ ద్వారా ఇలా కావాలాని చేసి నన్ను అన్యాయంగా ఇరికించారని అన్నారు.  అయితే టిక్ టాక్ పై క్రేజీ కోసం ఆమె ఇలా చేసిందని మరికొంత మంది అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: