ఇంటర్నెట్.. ఇప్పుడు ఏ చిన్న వింత జరిగిన అది వీడియోగా చిత్రీకరణ అయితే సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ గా మారిపోతుంది. ఇంకా అలా వైరల్ అయినా వీడియోలను చూసినప్పుడు కొన్ని సార్లు మనకు వావ్ అనిపిస్తే మరో సారి షాక్ అవుతాం.. మరికొన్ని సార్లు వామ్మో అంటాం. అలాంటి వామ్మో అనే వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

 

IHG

 

వామ్మో అనేంత వీడియో ఏంటి ? అని అనుకుంటున్నారా? అదేనండి.. ఓ వ్యక్తి ఎంతో సులభంగా వంద కేజీలకుపైగా ఉండే బైక్ ని తలపైన పెట్టుకొని బస్సు మీదకు ఎక్కించాడు. ఇంకా అలా ఎక్కించే సమయమ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు.. ఎంతో పర్ఫెక్ట్ గా తన తలపై పెట్టుకొని బ్యాలెన్స్‌ చేసుకొని నిచ్చెన సాయంతో బస్సు పైకి ఎక్కి సురక్షితంగా బైక్‌ను దించాడు.  

 

IHG

 

ఇంకా ఇది అంత జిష్ణు అనే వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేశాడు.. అయితే ఆ వీడియో ఎక్కడ తీశారు ? అందులో ఎవరు ఉన్నారు అనేది స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా ఈ వీడియోను చుసిన ప్రతి ఒక్కరు దీన్నే బ్యాలెన్సింగ్‌ అని అంటారు అంటూ ఆ ట్విట్ లో పేర్కొన్నారు. మరి అలాంటి బ్యాలెన్సింగ్ వీడియోను మీరు ఓ సారి చూసేయండి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: