కరోనా వచ్చింది.. పరిశుభ్రతను తెచ్చింది. కంటికి కనిపించని కరోనాతో శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లతో మనుషులు పోరాడుతున్నారు. ఇంకా బయటకు వచ్చారు అంటే చాలు ముక్కుకు మాస్క్, చేతికి గ్లౌజ్ లు.. జేబులో శానిటైజర్. ఉ అంటే చాలు శానిటైజర్లు ఉపయోగించేస్తున్నారు. సరే మానవరుకు ఓకే. మరి మనం బయటకు వెళ్ళినప్పుడు మన వెంట తీసుకెళ్లే ఫోన్ కు కరోనా గాలి తగిలి ఉంటుంది కదా! మరి ఆ ఫోన్ ముడితే మనకు వస్తుంది కదా! అప్పుడు ఎం చెయ్యాలి. ఫోన్ కు ఒక శానిటైజర్ కావాలి. మరి ఫోన్ల కోసమే ఇప్పుడు ప్రత్యేకంగా శానిటైజర్లు వచ్చాయి. ఆ శానిటైజర్లు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

స్ప్రే శానిటైజ‌ర్‌.. ఈ శానిటైజర్ల ధ‌ర 230 రూపాయ‌ల నుంచి 250 వ‌ర‌కు ఉంటుంది. వీటిని ఫోన్ కు ల్యాప్‌ట్యాప్ కు ఉపయోగించాలి. ఇంకా అవి వేశాక ఎలా అంటే అలా కాకుండా చక్కగా నెమ్మ‌దిగా రుద్దాల్సి ఉంటుంది.

 

పోర‌ట్రానిక్స్ స్వైప్‌.. దీన్ని మీ వెంట తీసుకెళ్ల‌డానికి ఎంతో సుల‌భంగా ఉంటుంది. ఇందులో స్ప్రేయ‌ర్‌తో పాటు శుభ్రం చేసేందుకు వీలుగా చిన్న వ‌స్త్రాన్ని కూడా ఇస్తారు. ఇంకా ఈ శానిటైజర్ ధ‌ర 249 రూపాయ‌లు.

 

నైకా జెన‌రిక్ యూవీ-సీ పోర్ట‌బుల్ శానిజైజింగ్ బాక్స్‌. ఇంకా ఈ శానిటైజర్ ఫోన్‌పై ఉండే బాక్టీరియా, వైర‌స్‌ను నాశ‌నం చేస్తుంది. ఇంకా ఈ శానిటైజర్ ధ‌ర ఏకంగా 3,200 రూపాయ‌లు.

 

కేవలం ఐదు నిమిషాలు సూక్ష్మ క్రిములన్నింటిని ఈ శానిటైజర్ మాయం చేస్తుందట. అయితే ఈ శానిటైజర్ ధ‌ర 4,800 రూపాయ‌లు. ఇంకా ఆ శానిటైజర్ ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి.. డెయిలీ ఆబ్జెక్ట్స్ పోర్టబుల్ మ‌ల్టీ ఫంక్ష‌న‌ల్ యూవీ స్టెరిలైజ‌ర్ అండ్ వైర్‌లెస్ చార్జ‌ర్‌. ఇంకా ఈ శానిటైజర్ కావాలి అంటే డెయిలీ ఆబ్జెక్ట్స్ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి ఆర్డ‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. 

 

చూశారుగా.. ఈ శానిటైజర్లు మీ ఫోన్ల కోసమే. వీటిని వినియోగిస్తే మీ సమస్యలు అన్ని మాయం అవుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: