మోడీ మొనగాడు అంటారు. ఆయన తలచుకుంటే అవతల ఎంతటి వారికైనా దెబ్బ పడిపోవడం ఖాయమని కూడా అంటారు. దేశంలో ఇందిరాగాంధీ తరువాత అత్యంత శక్తివంతమైన నాయకుడు మోడీ అని కూడా చెబుతారు. అటువంటి మోడీ పవర్ ఈ మధ్య తగ్గుతోందా అన్న డౌట్లు అందరిలో వస్తున్నాయి. దానికి తోడు విపక్షాల విమర్శల పైన కూడా జనం ఆలోచనలు చేస్తున్నారు.

 

కేవలం వందల కేసులు ఉన్నపుడు దేశంలో లాక్ డౌన్ని రెండు నెలలపాటు విధించిన మోడీ ఇపుడు లక్షల్లో కేసులు ఉంటే అసలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ గట్టిగానే విమర్శించారు. చప్పట్లు కొట్టించారని, దీపాలు వెలిగించాలని చెప్పారని, పాపం జనం కరోనా పోతుందని నమ్మారని కానీ చివరకు మాత్రం వేరేగా కధ ఉందని అంటున్నారు. 

 

ఇదిలా ఉండగా మోడీ మీద ఇపుడు మీడియాలో కూడా వ్యతిరేక కధనాలు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో కొన్ని రాయకపోయినా మరికొన్నిట్లో మాత్రం మోడీ వైఫల్యాలు బాగానే బ్యానర్ స్టోరీస్ అవుతుననాయి. వాటి క్లిప్పింగులను జత చేసి మరీ మోడీని రాహుల్ టార్గెట్ చేస్తూంటే బీజేపీ నాయకులు సమాధానం చెప్పలేకపోతున్నారు.

 

ఇప్పటికే ఇలాంటి డౌట్లు సామాన్య జనంలో ఉన్నాయి. వీటీకంటే ముందు మరోటి కూడా ఉంది. అసలు ఇతర దేశాల నుంచి కదా కరోనా వచ్చి పల్లెల దాకా పాకేసింది. మరి అటువంటపుడు మార్చిలోనే  విదేశీ విమానాలు ఎక్కడికక్కడ దించేసి అలా వచ్చిన వారిని అక్కడే  క్వారంటైన్ చేసి ఉంటే ఇంతలా కరోనా  విస్తరించేది కాదు కదా అన్న మాట కూడా ఉంది.

 

ఇపుడు చిన్న పల్లెలకు కూడా కరోనా వెళ్ళిపోయిందని, సామాజిక వ్యాప్తి దశలో ఉందని అంటున్నారు. పెను విస్పోటనం జరిగితే అమాయకులే బలి అవుతారని కూడా అంటున్నారు.   మరి రాహుల్ అన్నట్లుగా మోడీ నిజంగానే చతులెత్తేశారా. ఒకపుడు తరచూ కరోనా మీద రివ్యూస్, మంత్రులు, అధికారులతో మీటింగులు పెట్టే ప్రధాని ఇపుడు దాన్ని మరచిపోవడాన్ని కూడా రాహులు తప్పుపడుతూంటే బీజేపీ టీం సైలెంట్ అవుతోందిట.

మరింత సమాచారం తెలుసుకోండి: