వైకాపా తాడేపల్లి ఆఫీస్ లో తోట త్రిమూర్తులు తో ప్రెస్ మీట్ పెట్టిన చీరాల మాజీ ఎం‌ఎల్‌ఏ, ప్రస్తుత చీరాల వైకాపా ఇంచార్జ్ పవన్ కల్యాణ్ కాపుల మీద దొంగ ప్రేమ కురిపిస్తున్నారు అంటూ మండిపడ్డారు..  "కాపు రిజర్వేషన్ హామీ సాధ్యం కాదని కూడా చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి కాపులను మోసం చేశారు. 

 

ఆ టైంలో చంద్రబాబుకి మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండా, ఇప్పుడు జగన్ కాపులకు చేస్తున్న మేలు విషయంలో ప్రశ్నించడం సిగ్గుచేటు. ఇదే పవన్ కళ్యాణ్ కాపులకు రిజర్వేషన్ ఇస్తామని జనసేన మేనిఫెస్టో లో ఎందుకు చెప్పలేదు?
 
కాపు రిజర్వేషన్ హామీ విషయంలో క్లియర్ కట్ గా వైసీపీ మేనిఫెస్టో లో పాటు తూర్పు గోదావరి జిల్లా ఎన్నికల ప్రచారంలో పాదయాత్రలో కూడా కాపు రిజర్వేషన్ హామీ విషయంలో జగన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. 
రిజర్వేషన్ అనేది రాష్ట్ర పరిధిలో లేని అంశం, కేంద్ర పరిధిలో ఉన్న అంశం ఆ విషయంలో నేను ఏమి చేయలేను అని ఉన్నది ఉన్నట్టు గా జగన్ చెప్పుకొచ్చారు. 
 
కానీ కాపు రిజర్వేషన్ నేను ఇస్తాను అని చంద్రబాబు అసాధ్యమైన హామీ కాపులకు ఇచ్చి 2014 ఎన్నికలలో గెలిచి కాపులను దారుణంగా మోసం చేశారు. మరి ఆ టైంలో ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేకపోయారు. 
 
చంద్రబాబు అసెంబ్లీలో చేసిన కాపు బిల్లుకు చట్టబద్ధత లేదు. ఈ విషయంలో కాపు టిడిపి ఎమ్మెల్యేలు ఆ రోజు అంతర్గతంగా చంద్రబాబుతో గొడవ పెట్టుకోవడం జరిగింది. మరి అదే సమయంలో పవన్ కళ్యాణ్ ని ఎందుకు ప్రశ్నించలేదు. 
  
కాపుల ఐక్యతను విచ్ఛిన్నం చేసింది చంద్రబాబు. అదే కాపుల ఆత్మగౌరవాన్ని చంపేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడు.. 
 
ప్రజెంట్ కరోనా లాంటి విపత్కర టైంలో కూడా కాపు సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చిన వైయస్ జగన్… పై కాపులకు ఉన్న కొద్దీ ఇప్పుడు నమ్మకం ఏర్పడింది. 
 
దీంతో పవన్ కళ్యాణ్ ఇన్ సెక్యూరిటీతో కాపులు జగన్ వైపు మొగ్గు చూపూతారేమో  అని తన పబ్బం ఇంకా సినిమారంగంలో లాగా రాజకీయరంగంలో ఉడికే ప్రసక్తేలేదని తన రాజకీయ గురువు చంద్రబాబు మాదిరిగా కాపు రిజర్వేషన్ విషయంలో అవాస్తవాలు మాట్లాడుతున్నారు. 
 
ఏదైనా ఒక కమ్యూనిటీ కి ప్రభుత్వం మేలు చేయాలంటే కార్పొరేషన్ కింద నిధులు విడుదల చేయడం జరుగుతుంది. అసలు ఎటువంటి ఫండమెంటల్స్ తెలియని పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి ప్రశ్నించడం దౌర్భాగ్యం. 
 
పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పంపిన స్క్రిప్ట్ ని తన పార్టీ తరపున లెటర్ గా రిలీజ్ చేయడం… సినిమా షూటింగ్ లకి వెళ్లడం పైగా ప్రశ్నించటం అనటం అదికూడా కాపుల కోసం చాలా ఎటకారంగా ఉందని ఆమంచి సెటైర్లు వేశారు. 
 
రాష్ట్రంలో ఆత్మగౌరవం కలిగిన వాళ్ళు కాపులు, అటువంటి కాపులకు కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా వైయస్ జగన్ సహాయం చేయడంతో… ఆయనపై ఎనలేని గౌరవం పెరిగిందని ఆమంచి చెప్పుకొచ్చారు. 
 
త్వరలోనే కాపులు పవన్ కళ్యాణ్ ని తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గర ఉన్నాయని " పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: