ఇటీవల రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ కింద కాపులకు జగన్ సర్కార్ 4769 కోట్లు కేటాయించడం అందరికీ తెలిసిందే. ఇలా జగన్ సర్కార్ ప్రకటించిన వెంటనే పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాపు కార్పొరేషన్ కింద కాపులకు జగన్ సర్కార్ చేస్తున్న సహాయం పథకాలు అందరికీ ఇచ్చే పథకాలను ఇవ్వటమే...కానీ దీనిలో పెద్ద స్పెషాలిటీ ఏమీ లేదని షాకింగ్ కామెంట్లు చేశారు. కాపులకు మేలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే జగన్.... కాపులు అడుగుతున్న రిజర్వేషన్ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని పునరుద్ధరించడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా ‘‘మమ్మల్ని ఎవరూ ఉద్ధరించనక్కరలేదు. మా ఆత్మాభిమానం దెబ్బతినేలా జాలి చూపనక్కరలేదు.

 

మాకు గతంలో ఉన్న రిజర్వేషన్‌ని పునరుద్ధరించమనే అడుగుతున్నాం.. అని అంటున్న కాపులకు జగన్‌ ఏం సమాధానం చెబుతారు’’ అని ఆయన ప్రశ్నించారు. ఇదే టైం లో కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకుడు మంత్రి కన్నబాబు ని వైఎస్ఆర్సిపి అధిష్టానం లైన్ లోకి దింపటం జరిగింది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు వేస్తూ కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపుల కు వైఎస్ జగన్ మేలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు కంగారు పడిపోతున్నారు అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా జగన్ సర్కార్ చేస్తున్న మేలులను దుష్ప్రచారంగా పవన్ కళ్యాణ్ చిత్రీకరించటం పై విమర్శలు కురిపించారు. చంద్రబాబుపై ఎనలేని ప్రేమ పవన్ కళ్యాణ్ ఇంకా చూపిస్తున్నాడు అంటూ విమర్శలు సెటైర్ వేశారు.

 

గత ఎన్నికల టైంలో చంద్రబాబు కాపులను మోసం చేస్తే ముద్రగడ్డ ను చిత్రహింసలకు గురి చేస్తే ఈ పవన్ కళ్యాణ్ ఏమైపోయారు అని కన్నబాబు ప్రశ్నించారు.  కాగా కన్నబాబు మరియు పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ గురించి పెట్టిన మీడియా సమావేశాలు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వెంటనే అదే సామాజిక వర్గానికి చెందిన కన్నబాబు ని రంగంలోకి దింపి జగన్ ఈ విధంగా విమర్శలు చేయించడం కరెక్ట్ కాదు అని కొంతమంది రాష్ట్ర కాపు నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క కాపు సామాజిక వర్గానికి చెందిన బాధలు కాపు నేతకే తెలుస్తోంది కాబట్టి కన్నబాబు చేత మీడియా సమావేశం పెట్టించడం కరెక్టే అని మరి కొంతమంది భావిస్తున్నారు. ఏదిఏమైనా కాపు రిజర్వేషన్ మరియు ఇంకా కొన్ని కీలకమైన విషయాలు జగన్ గతంలోనే క్లారిటీగా తూర్పుగోదావరి పర్యటనలో అనేకమార్లు తెలపడం జరిగింది అని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: