ఒకానొక టైములో మీడియా రంగం అంటే రాజకీయ నాయకులు గడగడలాడే పరిస్థితి ఉండేది. కానీ రాను రాను మీడియా సంస్థలు ఆయా పార్టీల చేతుల్లో బందీలుగా మారటంతో చాలావరకు రాజకీయాలలో మీడియాను పట్టించుకున్న దాఖలాలు కనబడటం లేదు. చట్టసభలలో కూడా ఏకంగా మీడియా చానల్స్ పేర్లు చెప్పి రాజకీయ నాయకులు విమర్శలు చేయటం వలన ప్రజలకు కూడా జర్నలిజంపై నమ్మకం చాలా వరకు తగ్గిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఈ పరిస్థితి దారుణం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అధికార పార్టీకి కొన్ని పత్రికలు మరియు ఛానల్ లు ఏ విధంగా మద్దతు తెలుపుతాయో అదేరీతిలో ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ కూడా భారీ స్థాయిలోనే మీడియా ఛానల్ లు పత్రికలు మద్దతు తెలిపే పరిస్థితి ఉంది.

 

ఈ విధంగా మీడియా పరిస్థితి రాజకీయ పార్టీల మధ్య వాతావరణం ఉండటంతో ఒక పార్టీ అధికారంలోకి వస్తే కొన్ని ఛానల్స్ పత్రికలు నష్టాల్లోకి వెళ్లిపోవటం. మరొక పార్టీ అధికారంలోకి వస్తే ఆయా చానల్స్ మరియు పత్రికలు నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. ఏ విధంగా చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ మీడియా వర్గాలలో మాత్రం ప్రజల పక్షాన పోరాడే ఎటువంటి ఛానల్ పత్రిక లేదన్న టాక్ బలంగా వినబడుతోంది.

 

మీడియా ఛానల్స్ పత్రికలు చాలావరకూ ఏదో ఒక దురుద్దేశంతో పనిచేసే కార్యక్రమం నెలకొంది అని చాలామంది మేధావులు కూడా భావిస్తున్నారు. ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా వ్యవహరిస్తే మాత్రం రాబోయే రోజుల్లో ప్రజాసమస్యలు గురించి మాట్లాడే జర్నలిస్టులు కనబడే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా ప్రశ్నించటం లాంటి పరిస్థితి ప్రస్తుతం లేకపోవడంతో చాలా వరకు రాజకీయ పార్టీలు తమ ఉద్దేశాలు ప్రజల పై రుద్దుతున్నయి అన్న టాక్ బలంగా వినబడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: