ఉండవల్లి అరుణ్ కుమార్. పరిచయం అక్కరలేని పేరు. రాజకీయాలు తెలిసిన వారికి ఆ పేరు సుపరిచితం. రెండుసార్లు ఎంపీగా పనిచేసిన ఉండవల్లి వైఎస్సార్ కి వీర విధేయుడు. అసలు రాజమండ్రీ సీట్లో కాపులు, కమ్మలు, బీసీలు ఎక్కువగా ఉంటారు. అటువటి చోట బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ఉండవల్లిని నిలబెట్టి వైఎస్సార్ పెద్ద ప్రయోగం చేశారు. తన ఇమేజ్ తో గెలిపించుకున్నారు. 

 

వైఎస్సార్ తో దశాబ్దాల అనుబంధం ఉన్న ఉండవల్లి జగన్ విషయంలో మాత్రం ఇపుడు బాణాలు ఎక్కుపెట్టారు. తాజాగా ఆయన ప్రెస్ మీట్లో జగన్ సర్కార్ని చెడుగుడు ఆడేసారు. జగన్ పాలన సరిగ్గా లేదన్నారు. విపక్షాలను ఆయన టార్గెట్ చేస్తున్నారని కూడా హాట్ కామెంట్స్ చేశారు. జగన్ రాజకీయ కక్షలకు ప్రజలు ఇచ్చిన భారీ  తీర్పుని ఉపయోగించుకుంటున్నారని కూడా అన్నారు.

 

ఇవన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా మారాయి.మరుసటి రోజు టీడీపీ అనుకూల పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్ లైన్స్ లో వచ్చాయి. ఓ విధంగా ఉండవల్లి వంటి వారు చేసే కామెంట్స్ కి న్యూట్రల్ జనాల్లో విలువ ఉంటుంది. అలాంటిది ఉండవల్లి వైఎస్సార్ కుటుంబం మీద ఇంతలేసి మాటలు అంటూంటే జగన్ పార్టీలో అలజడి రేగింది.

 

అయితే జగన్ మాత్రం ఉండవల్లి మీద కౌంటర్లు వేయవద్దు అని ఆయన్ని అసలు విమర్శించవద్దు అని పార్టీ వారికి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. తన తండ్రితో పనిచేసిన ఉండవల్లి, కేవీపీ రామంచంద్రరావు లాంటి వారు అంటే తనకు గౌరవం ఉందని జగన్ చెప్పుకుంటారు. అయితే కాంగ్రెస్ అధినాయకత్వం వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసినపుడు ఉండవల్లి, కేవీపీ వంటి వారు సపోర్ట్ గా లేరన్న బాధ మాత్రం వైసీపీలో ఉంది.

 

ఇవన్నీ పక్కన పెడితే ఉండవల్లి రాజ్యసభ సీటు ఆశించారా . జగన్ మాత్రం వేరే ఎవరికో ఇచ్చి ఉండవల్లిని పట్టించుకోలేదా. మరి ఈ పరిణామాలు కారణంగానే ఉండవల్లి గట్టిగా జగన్ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారని కూడా వైసీపీ నుంచి ప్రచారం సాగుతోంది. ఇది ఎంతవరు నిజమో తెలియదు కానీ ఉండవల్లి హాట్ విమర్శలకు వైసీపీ నుంచి కౌంటర్లు పడలేదు అంటే జగన్ కి ఉండవల్లి మీద  గౌరవం అలాగే ఉందని భావిస్తున్నారు అంతా.

మరింత సమాచారం తెలుసుకోండి: