దేశ వ్యాప్తంగా "కులం చుట్టూ రాజకీయం తిరుగుతుందో... రాజకీయం చుట్టూ కులం తిరుగుతుందో" తెలియదు కానీ... ఏపీలో మాత్రం రెండూ జరుగుతాయి. కులం కార్డు పట్టుకుని రాజకీయంగా ఎదిగేయొచ్చు.., పదవులు కొట్టేయొచ్చు.., అని ఆలోచన ఉన్న నాయకులకు కొదవ లేదు. అలా వచ్చిన వాళ్లలో కొందరు నిలదొక్కుకుని కుర్చీలెక్కారు. కొందరు వైదొలిగారు, కొందరు మధ్యలో వెళ్లిపోయారు...! మిగిలిన కులాలను కాస్త పక్కన పెట్టి ఇప్పుడు "కాపు" కులానికి సంబంధించిన రాజకీయాన్ని మాట్లాడుకుందాం.

 

పవన్ ఏమన్నారంటే...?

 

రాష్ట్రంలో 22 శాతం పైగా ఓటర్లున్న కులానా ఇప్పుడు కీలక చర్చ జరుగుతుంది. కాపు నేస్తం అనే ప్రతిష్టాత్మక పథకం ద్వారా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం లబ్ది చేకూర్చింది. దీన్ని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రభుత్వం కాకి లెక్కలు చెప్తున్నారని, రిజెర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తే అది చేయకుండా పథకాల పేరిట మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. అన్ని కులాలకు కలిపి ఇచ్చిన లబ్దిని కేవలం కాపులకు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారని జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాపులను జగన్ మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక తాజాగా దీనిపై వైసీపీ కీలక కాపు నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణ మోహన్, తోట త్రిమూర్తులు స్పందించారు. కీలక పాయింట్లు మాట్లాడి పవన్ కళ్యాణ్ ని ఉతికారేసారు.

 

బాబుతో కలిసి కాపులను మోసం చేస్తున్నది పవన్...!

 

కాపు నేతలిద్దరూ ఈరోజు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కీలక పాయిట్లు ప్రస్తావించారు. చంద్రబాబు చేసిన మోసం..? కాపుల పేరిట పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం..? జగన్ చేకూర్చిన లబ్దిని వివరించారు. ఆమంచి రెండడుగులు ముందుకేసి పవన్ కళ్యాణ్ ని కాపులు తరిమి కొట్టే రోజులు వస్తాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబుతో కలిసి, పవన్ కళ్యాణ్ నీచ రాజకీయాలు చేస్తున్నారని కాపు సోదరులు మేల్కొనాలని పిలుపునిచ్చారు. ఆమంచి ఇంకా ఏమన్నారంటే "రాష్ట్రం కాపుల కోసం 11 పథకాలు అమలవుతున్నాయి. రూ. 4700 కోట్లు లబ్ది చేకూరింది. పథకాలు ఇతర కులాలకు ఇస్తున్నప్పటికీ..., కాపులకు కూడా అందుతున్నాయి. ప్రభుత్వ లబ్దిని, పథకాన్ని పవన్ కళ్యాణ్ వక్ర భాష్యం చెప్పారు. గతంలో చంద్రబాబు కార్పొరేషన్ ద్వారా అరకొరగా ఇచ్చారు. మేము అందరికీ ఇస్తున్నాం. వద్దు అంటారా..??" అంటూ ప్రశ్నించారు. "కాపు వర్గానికి చంద్రబాబు మొత్తం ఐదేళ్లలో రూ. 1870 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇంతకంటే ఇవ్వలేము అన్నారు. కానీ జగన్ ఏడాదిలోనే కాపు కార్పొరేషన్ ని మరింతగా అభివృద్ధి చేసి... మొత్తం కలిపి రూ. 4700  కోట్లు ఇచ్చారుగా అంటూ సూటిగా నిలదీశారు.

 

జనసేన మేనిఫెస్టోలో కూడా మోసమే...!

 

పార్టీల మేనిఫెస్టోలో కూడా వైసీపీ, జనసేన మధ్య తేడా తెలుసుకోవాలని కోరారు. "పవన్ కళ్యాణ్ కాపుల రిజెర్వేషన్ విషయంలో రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం చర్యలు తీసుకుంటాం అన్నారు. కానీ అంత తేలిగ్గా అవ్వదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇలా అతి తెలివి గా ఇచ్చారు. జగన్ మాత్రం మేనిఫెస్టో లో "కాపుల సంక్షేమం బిసి లకు నష్టం జరగకుండా మద్దతు ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు" అని వివరించారు. "పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టొకొ, ఫండమెంటల్స్ నేర్చుకో..,  శ్వేతా పత్రం ఎందుకు ?? ఇప్పుడు అన్నీ బహిరంగమే., కంప్యూటర్ లో ఉంటాయి. పూర్వం రోజుల్లో సమాచారం అందుబాటులో ఉండేది కాదు కాబట్టి శ్వేతపత్రాలు ఇచ్చేవారు. ఇప్పుడు అన్నీ బహిర్గతమే. బిజెపి, టీడీపీ, జనసేన కలిపి 2014 లో కలిసే ఉన్నా అమలు చేయలేదు. రాష్ట్ర పరిధిలో లేని అంశాలను రాష్ట్రంలో బిల్లు చేసి... చంద్రబాబు మోసం చేసారు. నాడు ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా చంద్రబాబు మోస పూరిత రాజకీయం చేశారు. బీసిలను , కాపులను దూరం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని నమ్మి, బిజెపి చంకన ఉన్నారుగా...  ఇప్పుడు చేయొచ్చుగా...? రాష్ట్ర పరిధిలో లేని అంశాలను ఎందుకు ఇక్కడ చర్చించడం..? అంటూ పవన్ ను సూటిగా ప్రశ్నించారు.

 

బాబు అనేక మోసాలు చేశారు...!

 

నాడు చంద్రబాబు వేసిన కమిటీ ఏమి చెప్పకుండానే అసెంబ్లీలో చర్చ చేసి, బిల్లు పెట్టారు. రిపోర్ట్ రాకుండానే చేసారు. నాడు కాపు ఎమ్మెల్యేలు చంద్రబాబుతో గొడవ పెట్టుకున్నారు. ఇటువంటి ఫేక్ హామీలకు పేటెంట్ చంద్రబాబు నాయుడు. మేము 5 శాతం రిజెర్వేషన్ కోసం పోరాడితే 5 వేల కేసులు పెట్టారు. ఇప్పుడు కేసులను జగన్ ఎత్తివేశారు. కాపులు గ్రహించాలి. కుల పరంగా అనేక సంఘటనలు జరిగాయి" అంటూ ఆమంచి పేర్కొన్నారు. రంగాని చంద్రబాబు బంధువులే చంపారు. కాపుల ఐక్యత విచ్చిన్నం  చేసిన వ్యక్తి చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కాపులను మోసం చేసేందుకు వచ్చారు. పోరాడతానుఅని చెప్పి అమ్ముడుపోయారు. పవన్ కళ్యాణ్ కాపులను మోసం చేయడానికి వచ్చావు. కాపులే నిన్ను తరిమి కొడతారు. చంద్రబాబు బంధువులతో కలిసి కులానికి అన్యాయం చేస్తున్నావు" అంటూ పవన్ , చంద్రబాబులపై తీవ్ర విమర్శలు చేసారు.

 

ఇక్కడితో ఆగుతుందా...!!

 

ఇది ఇక్కడితో ఆగుతుందా..? ఏపీలో కులాల పెరిగే రాజకీయం సహజమే. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన కులాల రాజకీయాలు ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే తోలి నుండి రాజకీయ ఉనికి, రాజకీయ పట్టు కోసం మాత్రం తీవ్రంగా పోరాడుతున్న సామాజికవర్గం కాపు. ఇప్పుడు వర్గం మూడు పార్టీల్లోనూ ఉంది. ఎవరి ఆలోచనలు, సిద్ధాంతాలుకు అనుగుణంగా వారు చెప్తున్నారు. అయితే ఇక్కడ జరిగిన లబ్ది, రిజెర్వేషన్ల పేరిట జరుగుతున్నా మోసాన్ని ఆమంచి కృష్ణ మోహన్ సూటిగా, స్పష్టంగా చెప్పేసారు. "రిజెర్వేషన్ అనేది జాతీయ అంశం. అది కేంద్రంలో పూర్తిగా మద్దతుతో సాధించాలి. దేశంలో మరో 100 కులాలు కూడా ఇలానే పోరాడుతున్నాయి. మనం సాధించాలంటే వారిని ఒప్పించాలి" అంటూ ఉంది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేసారు. పార్టీలు, ఆరోపణలు, రాజకీయాలు పక్కన పెడితే ఉన్నదీ ఉన్నట్టు.. ఇలా సున్నిత అంశంపై కుండా బద్దలు కొట్టినట్టు చెప్పడం నిజంగా సాహసమే.

మరింత సమాచారం తెలుసుకోండి: