గతంలో బ్రిటిష్ వాళ్ళు  వివిధ దేశాలకు వ్యాపారాలు చేసుకునేందుకు వెళ్లి.. ఆ తర్వాత క్రమక్రమంగా అక్కడి దేశాలను  తమ వశం చేసుకొని అందరినీ బానిసలుగా మార్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చైనా కూడా అలాంటి సామ్రాజ్యవాద విధానాన్ని అమలు చేస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది, ప్రతి దేశం విషయంలో  చైనా ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది, గతంలో భారత దేశంలో కూడా భారతదేశ కంపెనీలు అమ్ముతున్న ఉత్పత్తిల కంటే చైనా కు సంబంధించిన ఉత్పత్తులు అతి తక్కువ ధరకు అందించి  వినియోగదారులకు తమవైపు ఆకర్షించే భారత కంపెనీలు అన్నీ మూత పడేలా చేసింది చైనా, 

 

 ఇక భారత కంపెనీలు మూతపడ్డాయో  లేదో వెంటనే ధరలు మొత్తం పెంచేసి కస్టమర్ల అందరికీ వేరే  ఆప్షన్ లేకుండా చేసి భారత ఆర్థిక వ్యవస్థపై భారీగా ప్రభావం చూపింది. అయితే కేవలం శత్రు దేశాలపై నే కాదు తన మిత్ర దేశమైన పాకిస్థాన్ పై కూడా ఇదే వ్యూహాన్ని  ప్రయోగిస్తుంది చైనా. పాకిస్తాన్లో గాడిద మాంసానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలో అక్కడి వాళ్లు అందరూ ఎక్కువగా గాడిదల పెంపకం చేపట్టి తద్వారా ఎంతగానో ఆదాయం  సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా గాడిద బిర్యాని వ్యూహం పాకిస్తాన్లో అమలు చేస్తోంది. 

 

  పాకిస్తాన్ వ్యాప్తంగా గాడిద బిర్యానీ రెస్టారెంట్ లు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రస్తుతం చైనాతో మిత్ర దేశమైన పాకిస్థాన్లో గాడిద బిర్యానీ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చింది . పాకిస్తాన్ వ్యాపారులు అమ్ముతున్న దానికంటే చీప్ అండ్ బెస్ట్ గా గాడిద బిర్యాని విక్రయిస్తోంది చైన. తద్వారా పాకిస్తాన్ రెస్టారెంట్లకు అలవాటుపడ్డ కస్టమర్ లు  ప్రస్తుతం చైనా రెస్టారెంట్ కి వెళ్తున్నారు. పాకిస్తాన్ వ్యాపారులు తీవ్ర నష్టాల్లో  కూరుకుపోతున్నారు. అయితే చైనా ప్రస్తుతం మిత్ర దేశమైనటువంటి పాకిస్తాన్ ని నాశనం చేస్తూ సమాధుల పైన పునాది కట్టుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: