జగన్ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని గట్టిగా ప్రచారం సాగుతోంది. నిజానికి అదిపుడు కాదు కానీ అనుకోకుండా శాసనమండలి రద్దు చేయాలనుకోవడం, దాంతో పాటే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులను రాజ్యసభకు పంపడంతో ఇపుడు రెండు ఖాళీలు భర్తీ చేయడం అనివార్యం అయింది. దాంతో పాటే పనిచేయని వారికి డిమోషన్లు, పనిచేసిన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట.

 

ఈ నేపధ్యంలో డిప్యూటీ సీఎం గా పనిచేస్తూ రాజ్యసభకు ఎన్నిక అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో ఈసారి ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ కి ఉప ముఖ్యమంత్రి చాన్స్ ఉందని అంటున్నారు. బీసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాకుళం జిల్లా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ ని ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. 

 

వెలమ సామాజికవర్గానికి టీడీపీ హయాంలో ప్రాధాన్యత బాగా దక్కిందని అంటారు. అప్పట్లో అచ్చెన్నాయుడు, సుజయ క్రిష్ణ రంగారావు, అయ్యన్నపాత్రుడు వెలమ మంత్రులుగా ఉండేవారు. ఇపుడు జగన్ సర్కార్లో కేవలం ధర్మాన క్రిష్ణ దాస్ మాత్రమే ఉన్నారు. దాంతో ఆయనను డిప్యూటీఎ సీఎం గా పదోన్నతి కల్పిస్తే ఆ సామాజిక  వర్గం పూర్తి మద్దతు దక్కుతుందని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. 

 

దానికి తోడు ధర్మాన సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరుతెచ్చుకున్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటు అయితే మరింత ప్రాధాన్యత రాజకీయంగా ఉంటుంది. దాంతో  ధర్మానను జగన్ ఎంచుకున్నట్లుగా అర్ధమవుతోంది. అంతే కాదు, విశాఖకు చెందిన అవంతి శ్రీనివాస్, విజయనగరం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మంత్రి పదవులకు ఎసరు తప్పదని అంటున్నారు.

 

మొత్తానికి చూసుకుంటే జగన్ విస్తరణలో చాలా మందికి ఖేదమే మిగిలేలా ఉందని అంటున్నారు. మరి ఆ దురద్రుష్టవంతుల లిస్ట్ ఏంటో చూడాల్సిందే. ఎందుకంటే వారికి కనీసం రెండున్నరేళ్ల సమయం ఉందనుకుంటే ఇపుడు మరీ దారుణంగా ఏడాదికే ఇంటికి పంపితే కష్టమే కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: