ప్రస్తుతం అమెరికా ప్రజల్లో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే... అమెరికాలో రాబోయే ఎన్నికల్లో తనకి అసలు సిసలైన ప్రత్యర్థి జో బిడెన్ అనే చర్చ ప్రస్తుతం మొదలైంది. ట్రంప్ ను  జో బిడెన్ రానున్న ఎన్నికల్లో ఓడించడం ఖాయం అని కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ నియంత్రణలోట్రంప్  సర్కార్ విజయం చేయలేకపోవడం.. అదే సమయంలో అమెరికా ప్రజానీకంలో జొ బిడెన్  పాజిటివిటి  సంపాదించుకుంటుండటం...  దీంతో రానున్న ఎన్నికలలో ఘన విజయం సాధ్యం అని కొంతమంది విశ్లేషకులు కూడా చెబుతున్నారు, అయితే ఒకవేళ జో బిడెన్ గెలిస్తే భారత్కు ఇబ్బందులు తప్పవు అని అంటున్నారు విశ్లేషకులు

 

 ఎందుకంటే క్రానికల్ కమ్యూనిస్టు ఐడియాలజీ లకు పూర్తి ప్రదాతల లో ఒకరు జో బిడెన్. ఆయన ఆలోచన తీరు కూడా అదే రూట్ లో ఉంటుంది. మొన్నటి వరకూ అమెరికా లో జరిగినటువంటి విధ్వంసాలకు కారణం అతనే  అని చెప్పాలి. ముఖ్యంగా భారతదేశంపై ఎంతగానో ద్వేశాన్ని వెళ్లగక్కుతున్నారు.  కాశ్మీర్ అంశం లో పాకిస్థాన్ కి మద్దతుగా వ్యవహారశైలి.. సిఏఏ లాంటి వాటిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇలా జో బిడెన్ మొదటి నుంచి భారత్ పట్ల  కాస్త వ్యతిరేకంగానే ఉన్నారు.

 

 ఒకవేళ అమెరికాలో గనుక ట్రంపు ఓడిపోయి జో బిడెన్ గనుక విజయం సాధించి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపడితే  భారత్ అమెరికా మధ్య ఉన్న సంబంధాలు అన్ని దెబ్బతినే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా జో బిడెన్ ఒకవేళ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ మళ్లీ రెచ్చిపోవడానికి కూడా అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. దీంతో గతంలో లాగా పరిణామాలు మారే అవకాశం ఉంది అంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అందరూ చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: