మనలో చాలామంది చెప్పే మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. చేతల్లోకి వచ్చేసరికి మాత్రం ఆ పనులు చేయలేక చతికిలపడుతూ ఉంటారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో తిత్లీ తుఫాను బాధితులను పరామర్శించడానికి వెళ్లలేదని లోకేష్ తో పాటు ఇతర టీడీపీ నేతలు సైతం విమర్శలు చేశారు. జగన్ కు అంతకంటే అహంకారపూరిత ధోరణి ఏముంటుందని పేర్కొన్నారు. 
 
కానీ తిత్లీ తుఫాను బాధితులకు వైసీపీ నాయకులు ఆహార పొట్లాల పంపిణీ చేయడంతో పాటు వారికి కావాల్సిన ఇతర ఏర్పాట్లు చేశారు. జగన్ పాదయాత్రకు సంబంధించి షెడ్యూల్ ముందే ఫిక్స్ కావడంతో జగన్ తిత్లీ తుఫాను బాధితుల కోసం సమయం కేటాయించలేదు. దీంతో తెలుగుదేశం జగన్ కోర్టుకు సమయం కేటాయించినప్పుడు తిత్లీ తుఫాను బాధితుల కోసం సమయం ఎందుకు కేటాయించలేదనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. 
 
గత నెలన్నర రోజుల నుంచి ఏపీలో ఎల్జీ పాలిమర్స్ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. లోకేష్ గతంలో ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శిస్తానని చెప్పాడు. అనంతరం రాజధాని ప్రాంతానికి వెళతానని చెప్పాడు. అయితే ఆ తరువాత విజయవాడకు వచ్చి మహానాడుకు హాజరయ్యారే తప్ప లోకేష్ వైజాగ్ వెళ్లి బాధితులను పరామర్శించలేదు. తర్వాత 50,000 రూపాయల నష్టపరిహారం పార్టీ నాయకులచే ఇప్పించారు. 
 
నిన్న లోకేష్ విశాఖ, విజయనగరం జిల్లాల మీదుగా శ్రీకాకుళం వెళ్లారు. ఆయన అక్కడ అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ కుటుంబాన్ని పరామర్శించలేదు. లోకేష్ అక్కడికి వెళ్లి కార్యకర్తలకు, అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడం మంచిదే. కానీ ఆనాడు జగన్ ను విమర్శించిన లోకేష్ నేడు విశాఖ బాధితులను పరామర్శించడానికి ఎందుకు వెళ్లలేదు. అక్కడికి వెళ్లాడానికి భయపడ్డాడా...? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.                           

మరింత సమాచారం తెలుసుకోండి: