దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా విలయంతాండవం చేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుండి  భారీగా కేసులు నమోదవుతుండగా ఈరోజు ఆ సంఖ్య మరింతగా పెరిగింది. తమిళనాడులో ఏకంగా రికార్డు స్థాయిలో ఈ రోజు 3940 కేసులు నమోదయ్యాయి దాంతో ఇప్పటివరకు ఆరాష్ట్రంలో మొత్తం 82275కేసులు నమోదు కాగా 1079 కరోనా మరణాలు సంభవించాయి అలాగే కర్ణాటక లో ఈఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 1267కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 13190కి చేరింది. ఒక్క రోజే అక్కడ1000కి పైగా కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఈరోజు 983 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 14419కి చేరింది. ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు రికార్డు స్థాయిలో 813 కేసులు బయటపడగా ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం13098కేసులు నమోదయ్యాయి. 
 
ఇక కేరళలో కూడా ఈరోజు భారీగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క రోజే 118 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో మొత్తం 4189 కేసులు నమోదుకాగా అందులో 2015కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 2150మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 22 మంది మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: