ఇప్పటికే ప్రపంచమంతా కరోనా  మహమ్మారి దెబ్బకు, అది విజృభిస్తున్న తీరుకి అతలాకుతలం అవుతోంది  కట్టడి చేసే మార్గాలు పెద్దగా కనిపించకపోవడంతో పాటు, సుదీర్ఘకాలం ప్రజలను ఇళ్ల కే పరిమితం చేయడం కుదిరే పని కాకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. చాలా చోట్ల పూర్తిగా దీనిని ఎత్తివేశారు. దీంతో మరింత తీవ్రస్థాయిలో ఈ వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజు కి వేగంగా పెరుగుతోంది. కొత్త కేసులతో ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య కోటికి పైగా దాటింది. మరోవైపు కరోనా కారణంగా సుమారు ఐదు లక్షల మందికి పైగా మరణించారు. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుండడం ప్రతి ఒక్కరిని ఆందోళన కు గురిచేస్తోంది. 

 

ఇప్పటి వరకు కరోనా వచ్చిన వాళ్లలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి , ఒళ్ళు నొప్పులు, వాసన పసిగట్టి లేకపోవడం  వంటి లక్షణాలు మాత్రమే కనిపించినా ఇప్పుడు మరో కొత్త లక్షణాలు మూడు బయటపడ్డాయి. వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం వంటి మూడు లక్షణాలు కొత్తగా పాజిటివ్ సోకిన వారిలో కనిపిస్తున్నాయి అని వైద్యులు పేర్కొంటున్నారు. అలాగే గొంతులో మంట, అలసట, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు వంటి ల,క్షణాలు ఇంతకుముందు గుర్తించారు. ఈ లక్షణాలన్నీ వైరస్ సోకిన రెండు నుంచి 14 రోజుల మధ్యలో ఈ కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 


శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, ఒళ్ళు నొప్పులు, జ్వరం ఒణుకు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కుదిబ్బడ, వాంతులు , డయేరియా వంటి మరి కొన్ని లక్షణాలు కనిపిస్తే  ఆలస్యం చేయకుండా, వైద్యులను కలవాలని, ఈ వైరస్ వ్యాప్తి  చెందకుండా, ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలి అని అధికారులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: