కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి దాటిపోయాయి. అయినా గానీ ఇప్పటి వరకు సరైన మెడిసిన్ వ్యాక్సిన్ గాని వచ్చినట్లు అంతర్జాతీయస్థాయిలో ఎక్కడ వార్తలు రాలేదు. అమెరికా మరియు బ్రిటన్ అదేవిధంగా రష్యా దేశాలలో వైరస్ ప్రభావం ఉన్న కొద్దీ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఇండియాలో మొదటిలో చాలా కంట్రోల్ లో ఉందని భావించిన చాపకింద నీరులా ప్రస్తుతం రోజుకి 20 వేల కొత్త పాజిటివ్ కేసులు బయటపడటం అందరికీ భయాన్ని కలిగిస్తోంది. నాలుగో దశ లాక్ డౌన్ ఎత్తి వేసిన వెంటనే ఇండియాలో భయంకరంగా కేసులు బయటపడటంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది.

 

మరోసారి ఇండియాలో లాక్ డౌన్ పెట్టే పరిస్థితి ఉన్నట్లు ఆగస్టులో భయంకరంగా వైరస్ ప్రభావం ఇండియా వ్యాప్తంగా సోకే ప్రమాదం ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు. చాలా వరకు ప్రపంచంలో పరిస్థితి ఇలా ఉంటే జపాన్ దేశంలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. జపాన్ దేశంలో కరోనా వైరస్ చాలా కంట్రోల్ లో ఉండటంతో ఆ దేశంలో అవిగన్ అనే వ్యాక్సిన్ ప్రపంచంలో కొన్ని దేశాలలో ఆమోద ముద్ర పొందుకున్న జపాన్ లో మాత్రం పరీక్షలకు అవకాశం లేకుండా పోయింది . దేశ అధ్యక్షుడు షింజో అబే ఆదేశించిన అవిగన్ (ఫావిపైరవిర్) తో తమ ట్రైల్ ను కంప్లీట్ చేయాలని అనుకున్న పరిస్థితి వేరేలా ఉంది.

 

దేశంలో అసలు కరోనా పేషెంట్లే లేకపోవడంతో వ్యాక్సిన్ ట్రయిల్ టెస్టులు చేయడానికి కుదరట్లేదు. వ్యాక్సిన్ ట్రయిల్ అవ్వకుండా వ్యాక్సిన్ ని ఆమోదించే అవకాశం లేదు. దాంతో జపాన్ లోని స్థానిక ఫార్మా కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఆమోదించిన మెడిసిన్ ని జపాన్ లో ఆమోదించక పోవడం చాలా బాధాకరంగా ఉంది అని అంటున్నారు. చాలావరకు జపాన్ దేశంలో కరోనా పేషెంట్ లు లేకపోవటంతో వ్యాక్సిన్ నిర్ధారణ పరీక్షలు ఆగిపోవటం తో ఆ దేశంలో వెరైటీ పరిస్థితి ఏర్పడింది. మొదటిలో కరోనా భయంకరంగా వ్యాప్తిచెందిన తక్కువ టైమ్ లోనే అరికట్టడంతో...కరోనా బారిన పడిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాల కంటే జపాన్ చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: