ఎపిలో కరోనా కేసులు సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి.. నేడు 25,778 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, 813 మందికి కరోనా నిర్ధారణ అయింది. వాటిలో ఎపిలోని 13 జిల్లాలకు చెందిన వారు 755 మంది ఉండగా, వ‌ల‌స కూలీలు 50మంది, విదేశాల నుంచి వచ్చిన ఎనిమిది మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.

 

దీంతో ఎపిలో మార్చి తొమ్మిదో తేది నుంచి నేటి వరకు మొత్తం 13వేల 098 కేసులు నమోదయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల‌లో ఏకంగా 12 మంది మృత్యువాత ప‌డ్డారు. కర్నూలు జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 169కి పెరిగింది. తాజాగా 401 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో మహారాష్ట్ర 10, తమిళనాడు 14, తెలంగాణ 18, ఢిల్లీ 3, మధ్యప్రదేశ్ 2, చత్తీస్‌గఢ్ 1, కర్ణాటక 1, ఒడిశా 1 ఉన్నాయి. ఇప్పటివరకు ఏపీలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,908 కాగా, మరో 7,021 మంది చికిత్స పొందుతున్నారు.

 

నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 8,41,860 శాంపిల్స్ పరీక్షించగా ఏపీ నుంచి 10,848 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వచ్చినవారిలో 1,865 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 385 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వివరాలు వెల్లడించింది.

 

ఇక తెలంగాణ తో పోటీగా ఏపీ లో కూడా రోజుకు కనీసం 20%-30% వరకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటే జగన్ కూడా త్వరలోనే కీలకమైన లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో టాక్. అయితే ఇప్పుడు కేసులు ఎక్కువగా ఉన్న పలు చోట్ల.... ఏపీ లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధిస్తున్నారు. అయితే కొత్తగా విధించబోయే లాక్ డౌన్ కర్ఫ్యూ లాగా ఉండబోతుందా లేక యథాతథంగా ఉంటుందా అన్నది ప్రశ్న. తెలంగాణ సంపన్న రాష్ట్రంగా చెప్పుకున్న కేసీఆర్ కర్ఫ్యూ లాంటి లాక్ డౌన్ కే మొగ్గు చూపారని ఇప్పటికే వార్తలు వచ్చేయగాజగన్ మాత్రం ఆర్థిక సంక్షోభం లా అలాంటి నిర్ణయం తీసుకోక పోవచ్చు అని విశ్లేషకుల అంచనా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: