తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రోజురోజుకీ కరోనా కట్టడి విషయంలో విపరీతమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. టెస్టింగ్ కి సంబంధించి తెలంగాణ ఇప్పటికే అట్టడుగు స్థానంలో ఉన్న సమయంలో గత వారం రోజుల నుండి మాత్రమే అధిక స్థాయిలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. అయితే నేపథ్యంలో ల్యాబ్ లను సక్రమంగా మెయింటెన్ చేయలేక శాంపిల్స్ సేకరణ ఎక్కువైపోవడం మరియు అనుకున్న సమయానికి రిజల్ట్స్ ఇవ్వకపోవడంతో తెలంగాణలో రెండు రోజులు టెస్టింగ్ ఆపేయాల్సి వచ్చింది. దీనిపై కూడా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

 

తాజాగా హైదరాబాద్ లోని తెలంగాణ పోలీస్ అకాడమీ లో 180 మంది ట్రైనింగ్ తీసుకుంటున్న పోలీసులకి కరోనా పాజిటివ్ రావడం పెద్ద సంచలనమే సృష్టించింది. ఇది కూడా ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఉదాహరణ అని అంతమంది విరుచ్కుపడుతున్న సమయంలో ఇప్పుడు మరొక వైరల్ వీడియో బయటకు వచ్చింది. హైదరాబాద్ లో ప్రభుత్వం సూచించిన ఆసుపత్రిలో సౌకర్యాలు సరిగ్గా లేవంటూ ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి లో కొద్ది సేపటి క్రితమే కరోనాతో వ్యక్తి మరణించారు. అయితే వ్యక్తి చనిపోయేముందు అతని తండ్రికి పంపిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

 

యువకుడు తన ఫోన్ లో సెల్ఫీ వీడియో ఆన్ చేసుకుని మాట్లాడుతూ తాను మూడు గంటల నుండి ఎంతగా బ్రతిమలాడినా ఆసుపత్రి సిబ్బంది వెంటిలేటర్ పెట్టడం లేదని ఆయాసపడుతూ చెప్పిన మాటలు అందరి హృదయాలను పిండేశాయి. "నాకు గుండె ఆగిపోతుంది.... ఊపిరి ఆడడం లేదు డాడీ" అంటూ వ్యక్తి చేసిన ఆర్తనాదం అరచేతిలోనీ ఫోన్ లో అరణ్యరోదనే అయ్యింది. చివరికి వీడియోలోని వ్యక్తి ఈరోజు ఉదయం చనిపోవడం చాలా బాధాకరం.

 

ఇటివలే మీడియా ప్రతినిధి కూగా గాంధీ హాస్పిటల్ లో ఎటువంటి సౌకర్యాలు అందలేదని చనిపోయే ముందు సెల్పీ వీడియోలో తెలిపిన సంగతి కూడా తెలిసిందే.  మరి వీడియో ని అయినా కేసీఆర్ సీరియస్ గా తీసుకుని వెంటనే ఆస్పత్రి సిబ్బంది మరియు వైద్యులు కి తగిన ఆదేశాలు జారీ చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: