రాజకీయాలు అన్నవి ఒకపుడు ప్రజా సేవ కోసం, ఇపుడు కుర్చీల కోసం. ఎవరు కాదన్నా ఇదే ఇపుడు నడుస్తున్న చరిత్ర. అధికారంలో ఉన్నవారికి ఎవరైనా దాసోహం కావాల్సిందే. ఇక రాజకీయాలు పూర్తిగా వ్యాపారమయం అయ్యాయి. పెట్టుబడి పెట్టి నెగ్గడం, ఆనక అంతకు అంతా రాబట్టుకోవడం, ఓడినా, విపక్షలోకి జారినా సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. అపుడు ఆపద్భాంధవుడిగా అధికార పార్టీ కనబడుతుంది. ఇటువంటి సినేరియాలో విలువలు తొక్కా తోటకూరా వంటివి అనకూడని, వినకూడని పదాలు.

 

తెలంగాణాలో చూసుకుంటే పదేళ్ల క్రిత్రం టీడీపీ ఎంతో బలంగా ఉండేది 2009 ఎన్నికల్లో టీయారెస్ కి  తక్కువ సీట్లు ఇచ్చి మెజారిటీ సీట్లు అక్కడ పోటీ చేసిన ఘనత టీడీపీకి ఉంది. ఇక 2014 నాటికి టోటల్  సినిమాయే మారిపోయింది. టీడీపీకి 20 పైగా సీట్లు వచ్చినా వారంతా గులాబీ గూటిలోకి జారిపోయి 2019 నాటికి అస్థిత్వం కోల్పోయింది. దాంతో తెలంగాణాలో టీడీపీ దుకాణం దాదాపుగా బంద్ అయింది.

 

ఇదంతా ఎందుకంటే ఇపుడు ఏపీ టీడీపీకి 2014 కధ నడుస్తోంది. అంటే  నాడు అచ్చంగా 20 కి పైగా సీట్లు పొందిన టీడీపీ మరో వైపు ఏపీలో అధికారంలో ఉంటూ కూడా వాటిని టీయారెస్ పరం చేసేంది. ఇపుడు ఎక్కడా పవర్ లేదు, పైగా చంద్రబాబు రాజకీయం పూర్తిగా చతికిలపడిన వేళ జగన్ దూకుడు పెంచి అచ్చంగా తెలంగానా ఫార్ములానే అమలు చేస్తున్నారు. టీడీపీ మూలాలకే దెబ్బేస్తున్నారు.

 

మరి ఫలితాలు, పర్యవసానాలు అన్నీ సేం టూ సేం తెలంగాణా మాదిరిగా జరుగుతాయన్న భయం ఇపుడు సైకిల్ పార్టీకి పట్టుకుంది. అధికారం అండతో వైసీపీ దూకుడుగా సాగుతూంటే టీడీపీ విలవిలలాడుతోంది. తొలి ఏడాదిలోనే టీడీపీ  బిగ్ షాట్స్ మీద కన్నేసిన జగన్ సర్కార్ పెద్దలనే జైలు వైపు నడిపించింది. ఇపుడు అసలైన సినిమా ఉందని అంటున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ వింతలు ఏపీ చూస్తుందని అంటున్నారు, మరిన్ని విచారణలు జరిపించి ఇంకొందరిని కూడా అరెస్టుల దాకా తీసుకువతే టీడీపీకి ఇబ్బందులు తప్పవు.

 

ఇప్పటికే ఘోర ఓటమితో చేష్టలుడిగిన టీడీపీకి  జగన్ దూకుడు తెలంగాణానే గుర్తుకుతెస్తోంది. ఇక వైసీపీ కూడా ఏపీలో టీడీపీని బలహీనం చేయాలనుకుంటోంది. 2024 నాటికి అతి పెద్ద రాజకీయ పక్షంగా వైసీపీ ఉండేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. అదే జరిగితే ఖేల్ ఖతం, దుకాణం బంద్ అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: