కొన్నాళ్లుగా రాజకీయంగా మౌనంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ మధ్య మళ్లీ కలకలం సృష్టించారు. జగన్ కాపులకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వం కాపుల రిజర్వేషన్ అంశాన్ని పక్కదారి పట్టించడానికి కాపు కార్పొరేషన్ ను పెడితే...ఈ ప్రభుత్వం అంతకన్నా తెలివిగా ఏమార్చుతోందని పవన్ విమర్శించారు. నవరత్నాల స్కీములతో కలిపి కాపులకు 4770 కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారని, కాపు కార్పరేషన్ కు ఎంత ఇచ్చారని పవన్ ప్రశ్నించారు.

 

 

కాపునేస్తం కింద రెండున్నర లక్షల మందినే ఎంపిక చేయడం అనుమానాలకు తావిస్తోందని పవన్ కల్యాణ్ పాయింట్ లేవనెత్తారు. కాపు రిజర్వేషన్ గురించి వైసిపి ప్రజాప్రతినిదులు పూర్తిగా మర్చిపోయారని పవన్ మండిపడ్డారు. అయితే.. ముద్రగడ పద్మనాభాన్ని,ఆయన కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వంలో దారుణంగా అవమానించినప్పుడు కూడా విమర్శలు చేయని పవన్ కళ్యాణ్ , ఇప్పుడు రిజర్వేషన్ ల గురించి అడుగుతుండటంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

 

 

కరోనా కష్టకాలంలో కాపు మహిళలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.354 కోట్ల సహాయం చేశారని వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ అన్నారు. ఏడాది కాలంలో కాపుల కోసం రూ.4769 కోట్ల సంక్షేమం అందించామని అని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో ప్రాథమిక సూత్రాలు నేర్చుకోవాలని హితవు పలికారు. కాపులపై ప్రేమ ఉంటే 2014 ఎన్డీఏ ఉమ్మడి ప్రణాళికలో రిజర్వేషన్ల అంశం ఎందుకు చేర్చలేదని ఆమంచి ప్రశ్నించారు.

 

 

2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని పవన్ కల్యాణ్‌ ఎందుకు హామీ ఇవ్వలేదని ఆమంచి అన్నారు. మంజునాథ కమిటీ పూర్తి నివేదిక రాకుండానే అసెంబ్లీలో చంద్రబాబు చర్చించారని ఆయన విమర్శించారు. కాపుల్లోని ఐక్యతను చంద్రబాబు విచ్ఛిన్నం చేశారని...పవన్‌ కల్యాణ్‌ను కాపులే తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆమంచి అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: