ఏపీలో సీఎం జగన్ పాలన సంక్షేమం కేంద్రంగా సాగుతోంది. ఆయన సర్కారు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ప్రత్యేకంగా గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ఈ పథకాలు రూపొందిస్తున్నారు. గ్రామ వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. విద్యావ్యవస్థను కూడా అమ్మఒడి ద్వారా ప్రక్షాళన చేస్తున్నారు.

 

 

ఇప్పుడు తాజాగా ఆయన ఆరోగ్యరంగంపైనా దృష్టి సారించారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ ద్వారా విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశ పెట్టిన ఆయన ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంస్కరించబోతున్నారు. అంతే కాదు.. ఏపీలో ఇకపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

 

 

జగన్ సర్కారు నిజంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24 గంటలు పని చేసేలా చేయగలిగితే.. అది పేదలకు నిజంగా శుభవార్తే. రాష్ట్రంలో ప్రస్తుతం 1,175 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అందులోని సగం పీహెచ్‌సీల్లో ఒకే ఒక డాక్టరు ఉన్నారు. వైద్యుడు సెలవుపై వెళితే ఇక స్టాఫ్‌ నర్సే దిక్కు. వేళ కాని వేళ ఏదైనా అత్యవసర చికిత్స అవసరమైతే పట్టణాలకు పరుగెత్తాల్సిందే.

 

 

కానీ కొత్త ఆలోచన సాకారం అయితే.. ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు డాక్టర్లు ఉంటారు. రాష్ట్రంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలూ 24 గంటలు పనిచేస్తాయి. ఒక్కో పీహెచ్‌సీకి రోజుకు సగటున 100 మంది ఔట్‌ పేషెంటు సేవల కోసం వస్తుంటారు. కొత్తగా డాక్టర్లు, ఫార్మసిస్ట్‌లు, స్టాఫ్‌ నర్సులను నియమిస్తే 24 గంటలూ ఆస్పత్రులు చేస్తాయి. దీని కోసం పది వేలమంది డాక్టర్లు, ఇతర సిబ్బందిని ప్రభుత్వం నియమించబోతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్తనాయి. ఇది నిజమైతే జగన్ సూపర్ సీఎం అనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: