ఏపీ సీఎం వైఎస్ జగన్ విషయములో కేంద్ర పెద్దలు రుణం తీర్చుకోవాలని డిసైడ్ అయినట్లు జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలకమైన విషయాలలో  కేంద్రానికి చాలా అనుకూలంగా వ్యవహరిస్తూ సహకరిస్తున్న నేపథ్యంలో కేంద్ర బీజేపీ పెద్దలు జగన్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి రెండు కీలకమైన విషయాలను కేంద్ర పరిధిలో జగన్ గతంలో నేటడం జరిగింది. అవి ఏమిటంటే మొదటిది ప్రత్యేక హోదా మరొకటి శాసనమండలి రద్దు నిర్ణయం. రెండు విషయాలు కూడా జగన్ కి అత్యంత ప్రతిష్టాత్మకం.

 

అయితే ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ విధానం మారదని చెప్పవచ్చు, ఇక రెండోది మండలి రద్దు విషయం. దీనిని పార్లమెంటులో పెట్టి ఆమోదింప వలసిన పరిస్థితి ఉంది. అసెంబ్లీలో మండలి రద్దు చేయాలని బిల్లు పాస్ చేసిన పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ బిల్లుపై ఇప్పటి వరకు కేంద్రం దృష్టి పెట్టలేదు. దీంతో ఇటీవల చైనాతో యుద్ధం సమయం విషయంలో కేంద్రానికి కొంత అనుకూలంగా వ్యవహరించడంతో బీజేపీ పెద్దలు జగన్ ని కూడా సంతృప్తి పరచడానికి డిసైడ్ అయినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. 

 

అంతేకాకుండా రాజ్యసభలో జగన్ పార్టీకి  బలం 6 కి పెరగటంతో భవిష్యత్తులో జగన్ మద్దతు అవసరమయ్యే పరిస్థితి నెలకొనడంతో అంతో ఇంతో జగన్ కోరుతున్న వాటిపై దృష్టి పెట్టాలని ఆర్థికంగా భారం కాని వాటికి జై కొట్టాలని బిజెపి నాయకులు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో మండలి రద్దు బిల్లు ఆమోదింప చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందువల్లనే ఇటీవల కేంద్ర పెద్దలు రఘురామకృష్ణంరాజు... జగన్ కి వ్యతిరేకంగా వ్యవహరించి ఆయన కంప్లైంట్ ఇచ్చిన వాటిని పెద్దగా పట్టించుకోలేదు అన్న టాక్ నడుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: