తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి ఇలా అనేక విషయాల గురించి క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా లో కొంత మంది పనిగట్టుకుని మరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మవద్దని తెలంగాణ ప్రజలకు ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో కొన్ని వేల మంది కరోనా నుంచి కోలుకుంటుంటే వాటిని  చూపించకుండా మీడియా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే టైములో ఇటీవల ఆక్సిజన్ అందక చనిపోయినట్టు ఓ యువకుడు సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ గురించి ఈటెల వివరణ ఇచ్చారు.

 

ఆ రోగి పలు ఆస్పత్రులు తిరిగిన తర్వాత అక్కడకు వచ్చారని, ఇతర సమస్యల కారణంగా ఆ వ్యక్తి మరణించారని తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పెద్ద ఎత్తున చికిత్సలు చేస్తున్నామని అయినా కానీ కొంతమంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దానివల్ల వైద్య సిబ్బంది స్ఫూర్తి దెబ్బతింటుంది అని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం పూర్తిగా శ్రద్ధ తీసుకుని పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. పదివేల బెడ్ లకు ఆక్సిజన్ సదుపాయం కూడా కల్పిస్తున్నామని వెంటిలేటర్లు కూడా వెయ్యి సిద్ధంగా ఉన్నాయని ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు.

 

దేశంలో ఎటువంటి పరిస్థితి నెలకొందో….అదే పరిస్థితి హైదరాబాద్ నగరం లో ఉందని, దీనిపై ప్రజలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ఎలాగైనా కరోనాపై జయిస్తామని అన్నారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టి అయినా ప్రజల ప్రాణాలను కాపాడతాం. అదే విధంగా హైదరాబాదులో కరోనా నిర్ధారణ పరీక్షలు భారీ స్థాయిలోనే చేసి అవసరమైతే హైదరాబాద్ మొత్తం మరొకసారి లాక్ డౌన్ చేసే పరిస్థితి తీసుకొస్తామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: