దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. కరోనా ను అరికట్టడానికి దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. దేశంలో లాక్ డౌన్ విధించినప్పటికీ రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్యా గణనీయంగా పెరుగుతున్నాయి. 

 

 

దేశంలో కరోనా వైరస్ కేవలం ఆరు రోజుల్లోనే 1.10 లక్షల పాజిటివ్ కేసులు నమోదయిన తీరు వైరస్ ఉద్ధృతికి అద్దం పడుతోంది. గత నెల రోజుల నుంచి పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం మరో 19,700 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. దేశంలో మరో 384 మంది కరోనాకు బలయ్యారు.

 

 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత ఐటీ రాజధాని బెంగళూరును బెంబేలెత్తిస్తోంది.  తొలిసారిగా కర్ణాటకలో 1,000కిపైగా పాజిటివ్ కేసులు నమోదుకావడం గమనార్హం. ఆదివారం కర్ణాటకలో 1,267 కొత్త కేసులు నమోదు కాగా.. ఇందులో 783 బెంగళూరు నగరంలోనే ఉన్నాయి. ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఒకే రోజు 20వేలకుపైగా కేసులు నమోదయిన మూడో దేశంగా భారత్ నిలిచింది. 

 

 

ఓ పోలీసు ఏఎస్ఐ కరోనా వైరస్‌తో ఇంట్లో బాత్ రూంలో కుప్పకూలి మరణించిన విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. బెంగళూరు నగరంలోని వైట్ ఫీల్డ్ పోలీసుస్టేషనులో ఏఎస్ఐగా పనిచేస్తున్న 57 ఏళ్ల వ్యక్తి జూన్ 10వతేదీ నుంచి ఇంటి నుంచే పనిచేస్తున్నారని, ఇంట్లో రాత్రివేళ బాత్ రూంకు వెళ్లి స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.

 


అప్పటికే ఏఎస్ఐ మరణించాడని డాక్టర్లు ధ్రువీకరించారని డీసీపీ ఎంఎన్ అనుచేత్ చెప్పారు. ఏఎస్ఐ మృతదేహం నుంచి స్వాబ్ శాంపిల్ సేకరించి పరీక్షించగా అతనికి కరోనా ఉందని తేలిందని డీసీపీ చెప్పారు.దీంతో ఏఎస్ఐ కుటుంబసభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేయించారు. పోలీసు శాఖలో 55 ఏళ్లకు పైబడిన వయసు వారందరినీ ఇంటి నుంచి పనిచేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు అనుమతించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: