దేశంలో కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా వన్ ప్లస్ కంపెనీ జులై 2వ తేదీన స్మార్ట్ టీవీలను లాంచ్ చేయనున్నట్లు తెలియజేశారు. అయితే ఈ కంపెనీ ఎన్ని స్మార్ట్ టీవీలు లాంచ్ చేస్తుంది. ధరలు ఎంతెంత ఉండబోతుందనే విషయాలను తాజాగా వన్ ప్లస్ వెల్లడించారు. ఈ విషయాన్ని వన్ ప్లస్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ‘మీరు కోరుకున్న ధరలోనే ఈ టీవీలు లాంచ్ కానున్నాయని తెలిపారు. 

 

 

అయితే అందులో మొదటి టీవీ ధర 1x,999గా ఉండనుందన్నారు. రెండో టీవీ ధర 2x,999గానూ, మూడో టీవీ ధర 4x,999గానూ ఉండనున్నట్లు సందేశంలో పేర్కొందన్నారు. దీన్ని బట్టి చూస్తే మొదటి టీవీ ధర రూ.20 వేల లోపు, రెండో టీవీ ధర రూ.30 వేల లోపు, టాప్ ఎండ్ మోడల్ ధర రూ.50 వేల లోపు ఉండనున్నట్లు తెలుసుకోవచ్చునని అధికారులు తెలియజేశారు.

 

 

అయితే ఈ టీవీలకు సంబంధించి కొన్ని కీలక ఫీచర్లను కూడా కూడా వన్ ప్లస్ తెలియజేశారు. వీటి ప్రకారం ఈ స్మార్ట్ టీవీలు కేవలం 0.69 సెంటీమీటర్ల మందం మాత్రమే ఉండనున్నాయని తెలిపారు. వన్ ప్లస్ 8 ఫోన్ల కంటే టీవీలే సన్నగా ఉండటం విశేషం అన్నారు. వన్ ప్లస్ సీఈవో పీట్ లా ఈ టీవీల్లో డీప్ బేస్ ను కూడా అందించనున్నట్లు తెలిపారు. వీటిలో ఉన్న స్పీకర్లు 90 డిగ్రీల కోణంలో అమర్చబడి ఉన్నాయన్నారు. వీటి ద్వారా ఈ స్మార్ట్ టీవీకి రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లను కూడా అమర్చవచ్చని తెలియజేశారు.

 

 

దీనికి సంబంధించిన ప్రీబుకింగ్ ప్రస్తుతం అమెజాన్ లో ప్రారంభం అయ్యింది. వన్ ప్లస్ టీవీ మోడళ్లను ప్రీ-బుక్ చేసుకున్న వినియోగదారులు ఆకో జనరల్ ఇన్సూరెన్స్ అందించే రెండు సంవత్సరాల అదనపు వారంటీని పొందవచ్చునని యాజమాన్యం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: