దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఉన్న కొద్దీ పెరుగుతున్న తరుణంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ని ఎదుర్కోవడం కోసం నానా తంటాలు పడుతున్నాయి. ఎక్కువ పరీక్షలు చేసి వైరస్ ని కంట్రోల్ చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కరోనా నియంత్రించడంలో భాగంగా ఎక్కువ టెస్టులు చేయించి కరోనా చైన్ తెగ కొట్టాలని టెస్టింగ్ ఫార్ములా ద్వారా కంట్రోల్ చేయాలని ప్రభుత్వాలు భావిస్తున్నా టెస్టింగ్ ల్యాబ్ లు కొరత ఏర్పడుతున్న తరుణంలో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.

IHG

ఇదిలా ఉండగా దేశంలో అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడుతున్న రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర లో కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం జూన్ నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. కేసులు ఉన్న కొద్దీ విపరీతంగా పెరుగుతూ ఉండడంతో ఉద్దవ్ ఠాక్రే సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్దవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ చైన్ సిస్టం కట్ చేయాల్సిన అవసరం ఉంది అని లేకపోతే పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఉద్దవ్ పేర్కొన్నారు.

IHG

ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా భయంకరంగా వ్యాప్తి చెంది ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా మహారాష్ట్రలో వైరస్ విలయతాండవం పై ఆందోళన చెందుతున్నారు. దేశంలో అత్యధికంగా పాజిటివ్ కేసులు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. మొదటి నుండి ఈ రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఉన్న కొద్ది పెరుగుతూనే ఉంది. ఎక్కడా కూడా కంట్రోల్ అయిన దాఖలాలు కనబడలేదు. దీంతో రాష్ట్ర ప్రజలంతా ఉద్దవ్ థాకరే సర్కార్ పై మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: