తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లాలంటే ఆంక్ష‌లు లేక‌పోయినా.. ఇప్పుడు రూటు మార్చేశారు. తెలంగాణ నుంచి ఏపీకి, ఏపీ నుంచి తెలంగాణ‌కు వ‌స్తోన్న వారికి అడ్డు కట్ట వేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీకి వెళ్లేందుకు ఉన్న రూట్ల ద‌గ్గ‌ర అడ్డు క‌ట్ట వేస్తున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారు ఎక్కువుగా రెండు మూడు రూట్ల‌ను వాడుతుంటారు. వీరిలో ఎక్కువ మంది నల్గొండ మీదుగా మాచర్ల  వెళ్లేందుకు వయా వాడపల్లి మీదుగా వెళ్లటం తెలిసిందే. 

 

ఈ మార్గానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. లాక్ డౌన్ వేళ నుంచి ఈ మార్గంలో పెద్ద ఎత్తున రాకపోకల్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు సైతం ఇదే మార్గాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. తాజాగా పెరుగుతున్న కేసులకు చెక్ పెట్టే ఉద్దేశంతో నల్గొండ ఎస్పీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వాడ‌ప‌ల్లి మీదుగా ఏపీకి వెళ్లే వారికి పాసులు ఉంటే మాత్ర‌మే అనుమ‌తి ఇస్తున్నారు. ఇక ఏపీ నుంచి తెలంగాణ వ‌చ్చే వారికి కూడా పాసులు లేక‌పోయినా ఆ రాష్ట్రం ఇచ్చే పాసులు ఉండాల‌ని చెపుతున్నారు.

 

ఇక వాడ‌ప‌ల్లి మీదుగా వెళ్లే వాహ‌నాలు అన్ని ఉద‌యం ఏడు త‌ర్వాత లేదా రాత్రి ఏడు గంట‌ల‌కు ముందు మాత్ర‌మే చేరుకోవాల‌ని సూచించారు. ఇక అత్య‌వ‌స‌ర వ‌స్తువులు, స‌రుకుల ర‌వాణా విష‌యంలో మాత్రం తాము చెకింగ్ చేశాక మాత్ర‌మే అనుమ‌తి ఇస్తామ‌ని న‌ల్ల‌గొండ ఎస్పీ చెపుతున్నారు. ఈ నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రు ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ప్ర‌యాణం ప్లాన్ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: