అది ఏ ఇష్యూ అయినా.. ఎలాంటి సందర్భం అయినా సరే.. దాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా రాయడంలో ఏబీఎన్‌ ఆర్కేకు మించినవారు లేరని మీడియ సర్కిళ్లలో ఓ టాక్ ఉంది. మీడియా సర్కిల్ ఏముంది.. చదివే పాఠకులకూ ఆ విషయం తెలిసిందే.

 

 

IHG

 

తాజాగా ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( ఇంకా ఆయనకు ఏపీ సర్కారు బాధ్యతలు ఇవ్వలేదనుకోండి ) బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో రహస్యంగా భేటీ కావడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

 

దీన్ని ఏబీఎన్‌ ఆర్కే ఎలా కవర్ చేస్తున్నారో.. దానికి కామెంట్‌ ఏంటో చూద్దాం..

 

ఆర్కే రాత:

‘‘రాజ్యాంగబద్ధమైన సంస్థలలో నియమితులైన వారితో ఆటలా?’’ అని సుప్రీంకోర్టే ఆక్షేపించినప్పటికీ.. ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ విషయంలో జగన్‌ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవడం లేదు. ఈనెల 13వ తేదీన హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో భారతీయ జనతా పార్టీ ఎంపీ సుజనాచౌదరిని, అదే పార్టీకి చెందిన కామినేని శ్రీనివాస్‌, ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ కలుసుకోవడాన్ని జగన్‌ అండ్‌ కో భూతద్దంలో పెట్టి చూపించడానికి ప్రయత్నించింది.

 

కామెంట్:

రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తి ఇలా పార్టీ నేతలతో రహస్యంగా మంతనాలు ఎందుకు జరపాల్సివచ్చిందో.. దాన్ని వెలుగులోకి తెస్తే భూతద్దం అంటారేంటి ఆర్కే గారూ.. అందులో ఎలాంటి కుట్రా లేకపోతే.. ఇప్పటి వరకూ నిమ్మగడ్డ ఎందుకు స్పందించలేదో..?

 

 

ఆర్కే రాత:

హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన తర్వాత కూడా రమేశ్‌కుమార్‌ను పదవీ బాధ్యతలు చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటున్న విషయం విదితమే! ప్రభుత్వం దృష్టిలో ఆయన ఎన్నికల కమిషనర్‌ కాదు. అలాంటప్పుడు ఆయన ఎవరిని కలిస్తే ఏమిటంట?

 

కామెంట్ :

ప్రభుత్వం దృష్టిలో ఎన్నికల కమిషనర్ కాకపోతే.. ఏమైనా చేయొచ్చా.. ఎన్నికల కమిషనర్ గా గుర్తించకపోవడం అంటే రాజకీయ కుట్రలకు లైసెన్సు పొందడమా.. అంతేనంటారా ఆర్కేగారూ..

 

 

ఆర్కే రాత:

ముగ్గురూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడం యాదృచ్ఛికం కావొచ్చు. అంతమాత్రాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి ఈ వ్యవహారంతో ముడిపెట్టవచ్చునా..?

 

కామెంట్ :

మరి బాబుగారి గత చరిత్ర అలా ఉంది కదా గురువర్యా.. గతంలో ఓటుకు నోటు కుట్ర చూశాక కూడా అనుమానించకపోతే ఎలా.. సరే.. ఆ సంగతి వదిలేద్దాం.. కానీ.. అసలు ఈ భేటీలో ఎలాంటి అనుమానాస్పద అంశమూ మీకు ఎందుకు కలగలేదో.. అసలు ప్రశ్నించడం, ఆలోచించడం మానేసి.. పూర్తిగా ఆ ముగ్గురికీ మీరు క్లీన్ చిట్ ఎందుకు ఇస్తున్నారో.. అబ్బే ఇందులో పెద్దగా అనుమానించాల్సింది ఏమీ లేదని మీకు ఎలా అనిపించిందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: