తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కరోనాపై తెలంగాణ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. మొదట్లో కరోనా కట్టడిపై బాగానే దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిందని విపక్షాలు మండిపడుతున్నాయి. కరోనాపై తెలంగాణ సర్కారు బ్రహ్మాండంగా పోరాడుతోందంటూ సర్కారు చెప్పే మాటల సంగతి ఎలా ఉన్నా.. తాజాగా ఓ కరోనా రోగి సెల్ఫీ వీడియో ఇప్పుడు తెలంగాణలలో హాట్ టాపిక్ అయ్యింది.

 

 

హైదరాబాద్ చెస్ట్ హాస్పిటల్ లో ఓ వ్యక్తికి ఆక్సిజన్ తొలగించడంతో దారుణ పరిస్థితుల్లో చనిపోయాడు. చివరిసారిగా బై డాడీ బై అంటూ.. ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో సర్కారు దవాఖానాల్లో పరిస్థితికి అద్దం పడుతోంది. “వెంటిలేటర్ పీకేసిర్రు. ఊపిరాడుతలేదు అంటుంటే కూడా పెడ్తలేరు. చచ్చిపోతున్నా. అందరికి బాయ్ డాడీ..” అంటూ తుదిశ్వాస విడిచే ముందు బాధితుడు తీసుకున్న వీడియో చూపరుల గుండెల్లో ఆవేదనను రగిలిస్తుంది.

 

 

అయితే ఈ అంశంపై స్పందించిన మంత్రి ఈటల రాజేందర్ మాత్రం.. తెలంగాణలో కొన్ని వేల మంది కరోనా కోలుకుంటే, సోషల్ మీడియాలో కొందరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఆక్సిజన్ అందక చెస్ట్ ఆస్పత్రిలో మరణించిన ఘటనపై ఆయన వివరణ ఇచ్చారు. ఆ రోగి పలు ఆస్పత్రులు తిరిగిన తర్వాత అక్కడకు వచ్చారని,ఇతర సమస్యల కారణంగా ఆ వ్యక్తి మరణించారని ఆయన చెప్పారు.

 

 

సోషల్ మీడియాలో ప్రచారాల సంగతి సరే.. కానీ సాక్షాత్తూ చనిపోయిన వ్యక్తి చనిపోయే మందు చేసిన సెల్ఫీ వీడియో సంగతేంటి.. చనిపోయే వ్యక్తి అబద్దం చెప్పడు కదా. వెంటిలేటర్ పీకేసిర్రు. ఊపిరాడుతలేదు అంటుంటే కూడా పెడ్తలేరు. చచ్చిపోతున్నా. అందరికి బాయ్ డాడీ.. అతడు చెప్పిన మాటలు మాత్రం ఫేక్ కావు కదా.. !

 

మరింత సమాచారం తెలుసుకోండి: