తెలంగాణలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి కారణాలపై అధ్యయనం చేసేందుకు  వచ్చిన సెంట్రల్ టీమ్.. హైదరాబాద్ లోని  పలు ప్రాంతాల్లో పర్యటిస్తోంది. 

 

తెలంగాణలో కోవిడ్ వైరస్ దండయాత్ర కొనసాగుతోంది.రాకాసి వైరస్ విజృంభణకు రోజుకు సుమారు వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 90 శాతం ... హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి.  ముంబై, ఢిల్లీ, చెన్నై బాటలో హైదరాబాద్‌ చేరిపోతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నగరవాసి బయటకు రావాలంటేనే బయపడే పరిస్థితి దాపురించింది.

 

లాక్ డౌన్ సడలింపులతో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. ప్రధానంగా మెట్రోనగరాల్లో కేసులు పెరిగిపోతుండడంతో.... వైరస్ కట్టడిపై కేంద్రం ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రబృందాన్ని పంపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న కేంద్రబృందం...హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో పర్యటిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్.. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందం ... రాష్ట్రంలోని పరిస్థితిని అధ్యయనం చేసి, .కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.

 

దేశంలో కరోనా కేసులు నమోదవడం ప్రారంభమైనప్పటి నుంచే రాష్ట్రాలను అప్రమత్తం చేసేందుకు బృందాలను పంపుతోంది కేంద్రం. రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించి, పలు సూచనలు సలహాలు ఇచ్చాయి. కరోనా కేసులు ప్రారంభమయిన కొత్తలో వచ్చి టీమ్‌... కరోనా వార్డులు ఎలా ఉండాలి... ఐసోలేషన్ సదుపాయలు ఎలా ఏర్పాటు చేయాలో సూచించడంతో పాటు నమూనాల పరీక్షించడానికి ఏర్పాటైన ల్యాబ్‌లను పరిశీలించి వెళ్లింది. ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు తెలంగాణాలో పర్యటించి టీమ్‌... కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పరిస్థితులను సమీక్షించింది. లాక్ డౌన్ సడలింపుల తర్వాత కరోనాకు బాధితులకు అందిస్తున్న వైద్యం, వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించింది. తెలంగాణలో కమ్యూనిటీ స్ప్రెడ్‌ ఉందో? లేదో? నిర్దారించడానికి ఐసీఎమ్ఆర్ సీరం సర్వే నిర్వహించింది. తెలంగాణలో సమూహ వ్యాప్తి లేదని నిర్ధారించింది. 

 

తెలంగాణలో కరోనా నిర్దారణ పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేసుల్ని తక్కువగా చూపేందుకే పరీక్షలు చేయడం లేదన్నది వాళ్ల వాదన. ప్రతిపక్ష బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తగా... కాంగ్రెస్‌ కూడా వంతపాడుతోంది. అయితే, అధికార పార్టీ కూడా ఈ విమర్శలకు కౌంటరిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కవ పరీక్షలు చేశామని చెప్పుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సెంట్రల్ టీం తెలంగాణకు రావడం ఆసక్తి రేపుతోంది. 

 

తమ పర్యటనలో భాగంగా ఉదయం తొమ్మిది గంటలకు టిమ్స్‌ను కేంద్రబృందం సందర్శించనుంది. టిమ్స్ తర్వాత గాంధీ ఆస్పత్రి, దోమల్ గూడా కంటైన్మెంట్ జోన్.. ఆతర్వాత సెక్రటేరియట్‌లోని సీఎస్, వైద్యఆరోగ్య శాఖ అధికారులతో కేంద్ర బృందం భేటీ కానుంది. బీఆర్ కే  భవన్‌లో సీఎపర్యటనలో వివిధ ఆస్పత్రుల్లో ల్యాబులను పరిశీలిస్తోంది  బృందం. 

మరింత సమాచారం తెలుసుకోండి: