ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం భయంకరంగా ఉండటంతో ఛత్తీస్​గఢ్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి ఇంటిముందు ఓ వ్యక్తి సూసైడ్ చేసుకోవటానికి ప్రయత్నించటం కలకలం రేపింది. తనకి ఉద్యోగం ఇప్పించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించేందుకు యువకుడిని ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో వెంటనే నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నం సీఎం ఇంటి ముందు చేసుకోవటంతో ఈ ఘటన కలకలం రేపింది.IHG

భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ కావటంతో దుప్పట్లు దగ్గర ఉన్న నీళ్లతో ఆ యువకుడి పై చెలరేగిన మంటలను అదుపు చేయడంతో కొద్దిపాటి కాలిన గాయాలతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. తన దగ్గర పెట్రోల్ తో అంతా పకడ్బందీగా యువకుడు రావటంతో అప్పటికే దాదాపు శరీరం సగానికి పైగా కాలిపోయిందని వైద్యులు చెబుతున్నారు. ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలో దంతరీ ప్రాంతానికి చెందిన హర్​దేవ్ ఇంట‌ర్ కంప్లీట్ చేసి.. ఖాళీగా ఉంటూ.. ఆర్థిక సమస్యలతో స‌త‌మ‌త‌మవుతున్నాడు.

IHG

పైగా ఇటీవల లాక్ డౌన్ ఏర్పడటంతో అసలు పని చేసుకోవడానికి ఎలాంటి ఉపాధి లేకపోవటంతో ముఖ్యమంత్రిని కలిసి ఏదో ఒక ఉద్యోగం లో చేరాలని రావడం జరిగింది. పైగా ఇంటిలో ఒత్తిడి ఎక్కువ అవటంతో పాటు ఆర్థికంగా బలమైన కుటుంబం కాకపోవటంతో...ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి ఎంతో ఆశగా వచ్చిన యువకుడిని భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ఏం చేయలేని పరిస్థితి లో ఈ విధంగా పెట్రోల్ పోసుకుని తనని తాను కాల్చడానికి హర్​దేవ్ ప్రయత్నించటం అందరినీ కలచివేసింది. దీంతో ఈ వార్త ఇప్పుడు ఛత్తీస్​గఢ్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: