తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 975 కేసులు నమోదు కాగా ఆరుగురు మృతి చెందారు. గత 24 గంటల్లో తెలంగాణ సర్కార్ 2,678 శాంపిల్స్ ను పరీక్షించగా 975 మందికి వైరస్ నిర్ధారణ అయింది. పరీక్షించిన నమూనాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి వైరస్ నిర్ధారణ కావడం గమనార్హం. 
 
రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 861 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్ మరోసారి హైదరాబాద్ లో లాక్ డౌన్ ను ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రకటన చాలామంది ప్రజల్లో భయాందోళనను పెంచుతోంది. హోం మంత్రి, ఎమ్మెల్యేలకే కరోనా నిర్ధారణ కావడంతో లాక్ డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
ప్రజలు పరీక్షలు సరిగ్గా నిర్వహించడం లేదని, లక్షణాలు కనిపించకపోతే పరీక్షలు చేయకుండానే ఇంటికి పంపిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం గతంలో అందరూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాలని చెప్పగా ఎమ్మెల్యేలు, హోం మంత్రి మాత్రం మాత్రం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కేసీఆర్ లాక్ డౌన్ ప్రకటన ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. 
 
మరోసారి లాక్ డౌన్ ను ప్రకటిస్తే ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం పరీక్షల సంఖ్య పెంచి కరోనాకు చికిత్స చేసే ఆస్పత్రుల సంఖ్య పెంచితే లాక్ డౌన్ అవసరం ఉండదని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.                                  

మరింత సమాచారం తెలుసుకోండి: