ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో భారత్ కి సపోర్ట్ చేయాల్సిన కొన్ని భారత మీడియా సంస్థలు భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి... అదే సమయంలో చైనా మీడియా మాత్రం చైనా ను ఒక రేంజ్ లో సపోర్ట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా చైనా మరోసారి తమ దేశం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంది. తాజాగా చైనా కు సంబంధించిన గ్లోబల్ టైమ్స్ అనే మీడియాలో ఒక ఆసక్తికర ప్రచారం తెర మీదికి తెచ్చింది. 

 

 ప్రస్తుతం సరిహద్దుల్లో అమెరికా సహాయంతో భారత్ చైనా సైన్యంపై ముందుగా దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది అంటూ చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ అనే మీడియాలో ఒక ప్రచారం మొదలుపెట్టింది. అయితే ప్రస్తుతం చైనా తీరును తప్పుబడుతూ కొన్ని దేశాలు భారతదేశానికి మద్దతు తెలుపుతాము అని ప్రకటించడం చైనాకు మింగుడు పడడం లేదు. అందుకే ప్రస్తుతం అమెరికా సహాయంతో భారత్  చైనా పై దాడి చేసేందుకు సిద్ధమవుతోంది అని అక్కడ మీడియోలో  ప్రచారం చేసుకుంది. 

 


 గాల్వాన్  లోయలో వివాదం సృష్టించింది చైనా  ఎందుకంటే గాల్వాన్ భారత్  మౌలిక వసతులు కల్పించుకుని అన్ని సౌకర్యాలు కల్పించు కుంటే  భవిష్యత్తు లో భారత్ ని తమ అధీనంలోకి తెచ్చు కోవడం అస్సలు కుదరదు, అయితే చైనా భారత్ మధ్య జరిగిన ఘర్షణ లో ఏకంగా భారతదేశానికి చెందిన సైనికులు వీర మరణం పొందటం మరింత సంచలనంగా మారి పోయింది. ఇలాంటి సమయం లో అటు జపాన్ అమెరికా కూడా తమ వాదన వినిపించాయి.  అయితే దీన్ని ఆసరాగా చేసుకొని అమెరికా సాయంతో  భారత్ దాడి చేసేందుకు సిద్ధం అంటూ ప్రచారం మొదలు పెట్టింది ,

మరింత సమాచారం తెలుసుకోండి: