తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే  వుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 975 పాజిటివ్ కేసులు బయటపడినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో అత్యధికంగా జిహెచ్ఎంసిలో 861,రంగారెడ్డి లో 40,మేడ్చల్ లో 20కేసులు నమోదయ్యాయి. ఈరోజు మొత్తం 2648 శాంపిల్ టెస్టులు జరిగాయి అయితే గత రెండు రోజుల నుండి ఆల్రెడీ కలెక్ట్ చేసిన శాంపిల్ లను మాత్రమే పరీక్షించగా రేపటి నుండి కొత్త శాంపిల్ లను సేకరించనున్నారు. ఈమేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ రేపటి నుండి ఎక్కవ మొత్తంలో శాంపిల్ టెస్టులు చేయనున్నామని ప్రకటించారు.
 
కాగా ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 15394కరోనా కేసులు నమోదవ్వగా అందులో 5582మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 9559కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఈరోజు కరోనా తో 6గురు మరణించడంతో రాష్ట్రంలో  కరోనా మరణాల సంఖ్య 253కు చేరింది.   
 
ఇక దేశ వ్యాప్తంగా ఈఒక్క రోజే 19000 కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా ఇప్పటివరకు ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 560000 దాటగా 16800 మరణాలు చోటుచేసుకున్నాయి. కరోనా రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతుండడం తో పశ్చిమ బెంగాల్ ,జార్ఖండ్ , మహారాష్ట్ర ,తమిళనాడు రాష్ట్రాలు.. జులై 31వరకు లాక్ డౌన్ పొడిగించుకున్నట్లు ప్రకటించాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: