ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధసంపత్తి ఉన్న దేశాలలో చైనా ఒకటి. అలాంటి చైనా గత 50 రోజులుగా సరిహద్దు వివాదాలతో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ నిజంగా చైనాకు చెందిన గాల్వన్ లోయను ఆక్రమించి ఉంటే డ్రాగన్ దేశం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉండేది. చైనా భారత్ తో యుద్ధానికి సిద్ధమనే తరహా వ్యాఖ్యలు చేసింది. కానీ యుద్ధానికి వచ్చే సాహసం మాత్రం చేయలేకపోయింది. 
 
చైనా యుద్ధానికి ఎందుకు రాలేదనే ప్రశ్నకు కొన్ని ఆసక్తికరమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. చైనాకు గాల్వన్ లోయలో 60 శాతం భారత్ భూభాగంలో ఉందని మిగిలిన 40 శాతం చైనా భూభాగంలో ఉందనే సంగతి తెలుసు. ప్రపంచ దేశాలు కూడా ఇదే విషయం చెబుతాయి. అందువల్ల చైనాకు ప్రపంచ దేశాల నుంచి కూడా మద్దతు లభించే అవకాశం లేనే లేదు. గాల్వన్ లోయ మొత్తం ఆక్రమిస్తే మాత్రమే భవిష్యత్తులో సెక్యూరిటీపరంగా చైనాకు ప్రయోజనాలు చేకూరుతాయి. 
 
ఆక్సాచిన్ ను కాపాడుకోవాలన్నా, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో చైనాకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా గాల్వన్ లోయ అవసరం అవుతుంది. దీంతో సరిహద్దు వివాదాలు సృష్టించడానికి చైనా సిద్ధమైంది. ఐతే చైనా భారత్ విషయంలో సైలెంట్ గా ఉండటనికి కొన్ని ముఖ్యమైన కారణాలే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. చైనాకు విమానస్థావరం దగ్గరలో లేకపోవడం మైనస్ గా మారింది. 
 
దీంతో చైనా పీవోకేలోని విమానాశ్రయంపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. భారత్ వైమానిక దళం చైనాపై అటాక్ ప్రారంభిస్తే ఎనిమిది నిమిషాల్లో చైనా యుద్ధవిమానాలు ఉన్న ప్రాంతానికి చేరడంతో పాటు చైనాను దెబ్బ తీయడం సులభమవుతుంది. చైనా మనపై దాడి చేయాలనుకునేలోపు మనం తలచుకుంటే చైనా వైమానిక స్థావరాలను నాశనం చేసుకోగలుగుతాం. మరోవైపు యుద్ధం జరిగితే చైనాలో ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉండటంతో చైనా యుద్ధానికి సిద్ధం కావడానికి భయపడుతోందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: