తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. సామాన్య ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా ఈ మహమ్మారి భారిన పడుతున్నారు అందులో భాగంగా ఇప్పటికే పలువురు అధికార పార్టీ ఎమ్యెల్యేలకు వైరస్ సోకగా తాజాగా రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ  కూడా దీని బారిన పడ్డారు. ప్రస్తుతం అయన అపోలో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు ఇక కొద్దీ సేపటి క్రితం శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని సమాచారం. పద్మారావుతో పాటు ఆయన కుటుంబం లోని ఇద్దరు చిన్నారులకు కూడా ఈ వైరస్ సోకిందని తెలుస్తుంది. ప్రస్తుతం పద్మారావు కుటుంబం మొత్తం ఐసొలేషన్ లో వుంది.  
 
ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ లో 975 పాజిటివ్ కేసులు బయటపడినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో అత్యధికంగా జిహెచ్ఎంసిలో 861కేసులు నమోదయ్యాయి.ఈకొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం15394కరోనా కేసులు నమోదవ్వగా అందులో 5582మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 9559కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 253కు చేరింది. 
 
ఇదిలావుంటే దేశ వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్ల లో లాక్ డౌన్ ను జులై 31వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది అలాగే అన్ లాక్ 2.0 మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ రాత్రి 10గంటల నుండి ఉదయం 5గంటల వరకు కొనసాగనుంది. అన్ని రకాల విద్యాసంస్థలు , సినిమా హాళ్లు , మెట్రో రైళ్ల పై జులై 31వరకు నిషేధం కొనసాగనుంది. ఇక రేపు సాయంత్రం 4గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు దాంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: