ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి అనేక దేశాల శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు. రోజురోజుకీ ఈ వైరస్ ప్రభావం పెరిగిపోతున్న తరుణంలో మరోపక్క లాక్డౌన్ విధించిన గాని పరిస్థితి అదుపులోకి రాని నేపథ్యంలో పాటు ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలు లాక్డౌన్ చాలా వరకు ఎత్తేసాయి. దీంతో ప్రజెంట్ భయంకరంగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి.

IHG

ఇండియాలో కూడా చాలా దారుణంగా రోజుకి కొత్త పాజిటివ్ కేసులు 20 వేలకు పైగా  నమోదు కావడంతో చాలావరకు వైద్యులూ ఏం చెయ్యలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా కరోనా వ్యాక్సిన్ కోసం ఇండియాలో కూడా భారీ స్థాయిలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ నియంత్రణ వ్యాక్సిన్ కనిపెట్టడంలో భారత్ బయోటెక్ గుడ్ న్యూస్ తెలిపింది. అదేమిటంటే భారత్ బయోటెక్ చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు కరోనా వైరస్ కట్టడికి ‘కోవ్యాక్సిన్‌’ను కనిపెట్టినట్లు ప్రకటించింది.

IHG

ఈ సందర్భంగా  భారత్‌ బయోటెక్ కనుగొన్న‌ ‘కోవ్యాక్సిన్’‌ ప్రయోగాలకు డీసీజీఐ పర్మిష‌న్ లభించింది. హ్యూమ‌ల్ ట్ర‌యిల్స్ ఫేజ్‌-1, ఫేజ్‌-2 పరీక్షలకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. కోవిడ్-19 నియంత్రణకు తయారవుతున్న మొద‌టి స్వదేశీ వ్యాక్సిన్‌ ఇదే. భారత్‌ బయోటెక్‌, ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ క‌లిసి ‘కోవ్యాక్సిన్’‌ తయారీ చేశాయి. వచ్చే నెల నుంచి భారత్ బయోటెక్ మనుషులపై ట్ర‌యిల్స్‌ ప్రారంభించనుంది. ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ పై నమ్మకం ఉందని ఎండి కృష్ణా ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: