ప్రధాని మోడీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు యావత్ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పిఎంఓ ఆఫీస్ సోషల్ మీడియాలో తెలిపింది. భారత్ మరియు చైనా సరిహద్దుల మధ్య తీవ్ర యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో ప్రధాని మోడీ ప్రసంగం చేయనున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం ఇండియా డ్రాగన్ కంట్రీ దేశాల మధ్య కమాండర్ స్థాయి  చర్చలు జరుగుతున్న తరుణంలో  ఇదే టైమ్ లో మోడీ  యావత్ జాతిని ఉద్దేశించి  ప్రసంగించడం  ప్రాధాన్యతను సంతరించుకుంది.  తాజాగా  కేంద్ర ఐటి అండ్ ఎలక్ట్రానిక్ శాఖ  చైనా దేశానికి సంబంధించిన 59 యాప్ లను  నిషేధించిన పరిస్థితులలో  ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ  ఎలాంటి  సందేశం ఇస్తారు అన్న దానిపై  అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. 

 

సరిహద్దు ప్రాంతాలలో చైనా దేశం  దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలో  కమాండర్  స్థాయిలో జరిగే చర్చలలో  ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కూడా  ప్రతి ఒక్కరిలో నెలకొంది.  ఏదిఏమైనా దేశాలకు ప్రస్తుతం  కేంద్ర ప్రభుత్వం  తీసుకుంటున్న నిర్ణయాలు వ్యవహరిస్తున్న తీరు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి.  ఇదిలా ఉండగా  చైనా యాప్స్  లో  టిక్ టాక్ పై కూడా నిషేధం  విధించడంతో చాలా మంది భారతీయులు నిరుత్సాహం చెందుతున్నారు. మరో పక్క ఇలాంటి యాప్ భారతీయులు కనిపెట్టాలని కోరుతున్నారు.

 

ఏది ఏమైనా చైనా వస్తువులను నిషేధించాలని భారత్ తీసుకున్న నిర్ణయం చాలా వరకు దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇటీవల చైనా భారత సరిహద్దు ప్రాంతం లడక్ దగ్గర భారత్ కు చెందిన 20 మంది సైనికులను చైనా ఆర్మీ పట్టణ పెట్టుకోవడంతో అప్పటినుండే చైనా వస్తువుల పై సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం చైనా 59  యాప్ లను నిషేధించడాని చాలామంది సోషల్ మీడియాలో నెటిజన్లు స్వాగతిస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: