తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో కరోనాను బాగానే కట్టిడి చేసిన తెలంగాణ సర్కారు ఇప్పుడు చేతులెత్తేసిందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం భిన్నంగా స్పందిస్తోంది. ఇది అన్ని నగరాల్లో ఉన్న సమస్యనే అంటూ తన వాదన వినిపిస్తోంది.

 

 

హైదరాబాద్ నగరంలో జనాభా ఎక్కువగా ఉన్నారని, ఆర్థిక కార్యకలాపాలు అధికంగా సాగుతుంటాయని అందుకే కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయని తెలంగాణ ఛీప్ సెక్రటరీ సోమేష్ కుమార్ అంటున్నారు. ఇలా కేసులు విపరీతంగా వచ్చినా కంగారుపడడం సరికాదని ఆయన అంటున్నారు. ఆయన వాదన ఏంటంటే.. కేసులు ఎన్ని వచ్చాయనేది ముఖ్యం కాదట. కరోనా వల్ల ఎందరు మరణించారన్నది చూడాలంటున్నారు.

 

 

ఎందుకంటే.. దేశ వ్యాప్తంగా మరణాల రేటు మూడు ఉంటే, తెలంగాణలో 1.1 మాత్రమే ఉందని సోమేశ్ కుమార్ వివరిస్తున్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని సోమేశ్ కుమార్ చెబుతున్నారు. కరోనా పరీక్షలు కూడా కొనసాగిస్తామని ఆయన అన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు నిర్దిష్ట ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లవచ్చని సూచిస్తున్నారు.

 

 

అయితే కరోనా కట్టడి విషయాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చిచూడటాన్ని సోమేశ్ కుమార్ తప్పుబట్టారు. ఒక్కో రాష్ట్రం ఒక్క విధానం పాటించవచ్చని ఆయన అన్నారు. తాము మాత్రం కేంద్రం చెబుతున్నట్టు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: