ప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతినుద్దేశించి మరోసారి ప్రసంగించనున్నారు. ఈరోజు సాయంత్రం మోదీ ప్రసంగం గురించి పీఎంవో కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ విజృంభిస్తూ ఉండటంతో జులై 31వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కీలక ప్రకటన చేసింది. నిన్న రాత్రి కేంద్రం నుంచి అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈరోజు ఉదయం భారత్ చైనా మధ్య కమాండర్ల స్థాయి చర్చలు జరుగుతున్నాయి. 
 
ఇదే సమయంలో ప్రభుత్వం 59 చైనా యాప్ లపై నిషేధం విధించటంతో ఏం చెబుతారనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరోవైపు కేంద్రం చైనా యాప్ లపై నిషేధం విధించటం గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. కేంద్రం దేశ రక్షణ, భద్రత దృష్ట్యా టిక్ టాక్ తో పాటు 59 చైనా యాప్ లపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రికల్ శాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 
 
చైనా యాప్ లైన టిక్ టాక్, ఎం.ఐ వీడియో కాల్ సహా మొత్తం 59 యాప్ లను వాడొద్దని కేంద్రం సూచించింది. భారత్ నుంచి ఈ యాప్ లు రకరకాల సమాచారం సేకరిస్తూ ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ చైనా సరిహద్దుల్లో గల్వాన్ లోయ దగ్గర జూన్ 15వ తేదీన ఘర్షణలు చోటు చేసుకున్న అనంతరం కేంద్రం ఒకవైపు శాంతియుతంగా చర్చలు జరుపుతూ మరోవైపు చైనా ఆగడాలను ఎదుర్కోవాలనే అంశంపై వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది. 
 
చైనా ఉత్పత్తులు, చైనా పేరుతో తయారై భారత్ లో చలామణి అవుతున్న యాప్ లను నిషేధించాలని భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల టిక్ టాక్, షేర్ ఇట్, హలో, లైకీ, యూకామ్, వీచాట్, ఎం.ఐ వీడియో కాల్, కామ్ స్కానర్, వండర్ కెమెరా, స్వీట్ సెల్ఫీ ఇతర అప్లికేషన్లపై బ్యాన్ అమలౌతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: