పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారాన్ని ఆషామాషీగా వదిలి పెట్టేలా జగన్ కనిపించడం లేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా, పార్టీ పైన, అధినాయకుడు జగన్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేయడాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారు. ఆయన బిజెపిలో చేరేందుకు , ఈ విధంగా పార్టీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారని, పార్టీ ఆయనను సస్పెండ్ చేస్తే బిజెపిలో చేరవచ్చు అనేది రఘురామకృష్ణంరాజు ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే ఆయనకు ఆ అవకాశం లేకుండా, పార్టీలోని ఇతర ఎంపీలు ఎవరు పార్టీ గీత దాటకుండా, కట్టడి చేసే విధంగా రఘురామకృష్ణంరాజు ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా, ఢిల్లీ స్థాయిలో జగన్ చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది. 
 
IHG
 
మొన్నటి వరకు పార్టీపై తీవ్ర విమర్శలు చేసినా, తాను పార్టీకి విధేయుడునే అంటూ జగన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయినా ఆయనకు గట్టి షాక్ ఇచ్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు వైసీపీ ఎంపీ బాలశౌరి ఢిల్లీలో మకాం వేసి కేంద్ర మంత్రులను కలుస్తూ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణంరాజు ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వెంటనే, ఆయన లోక్ సభ సభ్యత్వం కూడా రద్దు అయ్యే విధంగా వైసిపి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 
 
IHG
 
ఈ మేరకు కేంద్ర పెద్దలతో బాలశౌరి సమావేశం అవుతూ ఉండడం వెనుక కారణం ఇదే అని సమాచారం. గతంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన జేడీయూ ఎంపీ శరద్ యాదవ్ పై రాజ్యసభలో వేటు వేసిన అంశాన్ని వైసిపి తెరపైకి తీసుకు వస్తోంది. రఘురామ కృష్ణంరాజు విషయంలో చూసిచూడనట్లు వదిలేస్తే, పార్టీలో మరి కొంత మంది ఎంపీలు ఆయన బాటలో పయనించే అవకాశం ఉండడంతో వైసిపి ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: